Breaking News

నా ఏజ్ ... గేజ్ చూడాలి కదా

Published on Sat, 03/01/2025 - 20:41

నా ఏజ్ ఏంది.. .. నా  గేజ్ ఏంది.. అన్నిటికి మించి నా రేంజ్ ఏంది.. అన్నీ తెలిసే నాకు ఈ పోస్ట్ ఇచ్చారా.. నా జూనియర్ల వద్ద నేను పని చేయాలా... వద్దు అంటూ మాజీ డిజి ఏబీ వెంకటేశ్వర రావు అలిగి కూర్చున్నారు. తనకు ఇచ్చిన పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో చేరకుండా ఊరుకున్నారు. తెలుగుదేశం హయాంలో ఇంటలిజెన్స్ డిజి హోదాలో పార్టీ కార్యకర్తకన్నా ఎక్కువగా పనిచేసారు.. ఆనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ దగ్గర్నుంచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను బెదిరించిమరీ తెలుగుదేశంలో చేర్చడం వెనుక అయన కీలకంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 

దీంతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఆయన్ను సస్పెండ్ చేసింది.. దాదాపుగా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అయన పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్లో  ఉంటూ కోర్టుల చుట్టూ తిరిగారు.. అయితే రిటైర్మెంట్ రోజే ఆయన్ను విధుల్లోకి చేర్చుకున్న ప్రభుత్వం అదేరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేశారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక తనకు చాలా కీలకమైన బాధ్యత ఇస్తారని ఆశించారు. అలాంటిదేం లేకపోయినా రెండేళ్ల సస్పెన్షన్ కాలాన్ని సర్వీసుగా గుర్తిస్తూ దానికి సంబంధించి జీతభత్యాలు చెల్లించేలా మాత్రం కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇక ఆయనకు మంచి ప్రాధాన్యం ఉండే పోస్టింగ్ పోస్టింగ్ ఇస్తారు అని ఆశించినా పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ పోస్ట్ ఇచ్చి ఊరుకున్నా ప్రభుత్వం ఆయన్ను అక్కడికి పరిమితం చేసింది. అయితే అది తన స్థాయికి తగిన పదవి కాదని, తన జూనియర్లు.. తన కింద పని చేసినవాళ్లు కూడా ఇప్పుడు తనకన్నా పెద్ద పోస్టుల్లో ఉన్నారని.. ఇప్పుడు తాను వారివద్ద ఎలా పని చేస్తానని అంటూ ఫిబ్రవరి ఒకటిన ఉత్తర్వులు వచ్చినా నెలరోజులు గడిచినా ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారు అనుకుంటే కేవలం ఒక శాఖకు సంబంచించిన ఓ పోస్టులో పడేశారని.. అందులో పెద్దగా చేయడానికి కూడా ఏమీ ఉండదని అయన అంటున్నారు. 

ఎస్పీలు.. ఇతర ఉన్నతాధికారులతో నేరుగా సంబంధాలు ఉండవని.. వారిపై ఆధిపత్యం .. పవర్ చూపడానికి ఏమాత్రం అవకాశం లేని హోసింగ్ కార్పొరేషన్ పదవిలో ఎందుకు చేరాలని అయన మధనపడుతున్నారు. ఇటీవలనే రిటైర్ అయిన డీజీపీ ద్వారకాతిరుమల రావును ఆర్టీసీ ఎండీగా నియమించారని.. ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ ను కూడా సర్వీసు పొడిగించి మరీ కొనసాగిస్తున్నారని.. అలాంటిది తాను తెలుగుదేశానికి ఇంత సేవలు చేస్తే తనకు ఇచ్చేది ఓ నామమాత్రపు పోస్టింగా అంటూ పెదవి విరిచి ఆ పోస్టులో చేరకుండా అలకవహిస్తున్నట్లు తెలిసింది. మరి ప్రభుత్వ పెద్దలు ఆయన్ను బుజ్జగిస్తారో.. ఇచ్చిందే ఎక్కువ తీసుకుంటే తీసుకో.. అలిగితే అట్టూ లేదు.. ముక్కా లేదని మిన్నకుంటారో చూడాలి.
-సిమ్మాదిరప్పన్న

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)