Breaking News

నష్టం అంచనాకు ప్రత్యేక యాప్‌

Published on Fri, 09/06/2024 - 05:49

సాక్షి, అమరావతి: వరద ముంపు ప్రాంతంలో దెబ్బ­తిన్న వ్యాపారులు, నష్టపో­యిన ఇంటి వస్తువులను అంచనా వేయడానికి ప్రత్యేక యాప్‌ ద్వారా సర్వే చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాము తిరిగి నిలదొక్కుకోగలము అన్న ధీమా కల్పిం­చేలా బాధితులకు ప్యాకేజీని రూపొందిస్తు­న్నట్లు తెలిపారు. ఆయన గురువారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లా­డుతూ.. ఇంట్లో చెడిపోయిన వస్తువులను బాగు చేయడానికి వర్కర్లను ఏర్పాటు చేస్తామని, అవస­రమైతే ఉబరైజేషన్‌ (ఆన్‌లైన్‌ ద్వారా వినియో­గదారులకు సేవలందించే సంస్థలు) సేవలను కూడా వినియోగించుకుంటామని తెలిపారు.

వరద ప్రాంతాల్లో ఈ నెల విద్యుత్‌ బిల్లులను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. తక్షణం కుళాయిల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నా, వాటిని రెండు రోజుల పాటు వంటకు, తాగడానికి వినియోగించవద్దని సూచించారు. రెండు రోజుల్లోగా రేషన్, శానిటేషన్, టెలీకమ్యూనికేషన్, విద్యుత్‌ సమస్య­లను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. 

శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రోజుకు 80,000 మందికి చొప్పున నూడుల్స్‌ ప్యాకెట్లు, ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్లు, పాలు, వాటర్‌ బాటిళ్లు అందిస్తామని, చౌకగా కూరగాయలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బుడమేరులో వరద తిరిగి కొద్దిగా పెరుగుతోందని, 6,000 క్యూసెక్కుల వరకు వస్తే నగరంలోకి తిరిగి కొద్దిగా నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మూడో గండి కూడా పూడిస్తే నగరంలోకి నీళ్లు వచ్చే ప్రమాదం తప్పిపోతుందన్నారు. ఈ గండిని పూడ్చడానికి ఆర్మీ రంగంలోకి దిగినట్లు తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు