Breaking News

AP: సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు.. ఎప్పటినుంచంటే..

Published on Wed, 01/18/2023 - 11:37

సాక్షి, అమరావతి: ఆధార్‌లో బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో గురువారం నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించనుంది. ఈ నెల 19, 20, 21, 23, 24 తేదీల్లో ఆయా సచివాలయాలు, వాటి పరిధిలోని పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో 7 నుంచి 10 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మరోసారి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ సాగిలి షన్‌మోహన్‌ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్‌చార్జి అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్‌ సేవలు పొందేలా ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌లు తగిన ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్‌ సేవల పైనే దృష్టి పెడతారు. ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం పదేళ్లలో కనీసం ఒకసారి బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌  చేసుకోవాలి. ఇలా అప్‌డేట్‌ చేసుకోనివారు రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారుల అంచనా.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆధార్‌ అనుసంధానంతో అమలు చేస్తున్నారు. నవరత్నాలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 35 సంక్షేమ పథకాలకూ ఆధార్‌ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్‌ విధానాన్ని అనుసరిస్తోంది. పారదర్శకత కోసం ప్రభుత్వ లబ్ధిని అందజేసే ముందు, అందజేసిన తర్వాత కూడా లబ్ధిదారుల నుంచి వలంటీర్లు బయోమెట్రిక్‌ తీసుకొంటున్నారు. బయోమెట్రిక్‌ వివరాల్లో ఇబ్బందులు రాకుండా ప్రత్యేక క్యాంపుల ద్వారా రాష్ట్ర ప్రజలందరి ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేస్తోంది.  

చదవండి: (శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్‌ భార్య ఆత్మహత్య)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)