Breaking News

రాష్ట్రాన్ని తాకిన నైరుతి

Published on Tue, 05/27/2025 - 03:34

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమ­వా­రం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవ­నాలు తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వీటి వేగాన్ని బట్టి మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు 16 ఏళ్ల తర్వాత ముందస్తుగా భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. సాధారణంగా ఇవి జూన్‌ ఒకటో తేదీన కేరళను తాకి, ఆ తర్వాత మూడు రోజుల్లో (జూన్‌ 4) ఏపీలోకి ప్రవేశిస్తాయి.

ఒక్కో­సారి కేరళను తాకిన తర్వాత కూడా వాతావరణ పరిస్థితులు మారడంతో ఏపీకి రావడానికి ఆలస్యమైన సందర్భాలున్నాయి. కానీ, ఈసారి మాత్రం ప­ది రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించా­యి. లానినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల గమనాన్ని బట్టి ఈ ఏడాది అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.  

కూల్‌ సమ్మర్‌  
వాతావరణంలో అనూహ్య మార్పులు, రుతుపవనాలు ముందస్తుగా పలకరించడంతో ఈ ఏడాది వేసవి ప్రభావం రాష్ట్రంలో పెద్దగా కనిపించలేదు. మామూలుగా మే నెలలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. రోహిణీ కార్తెలో ఎండతోపాటు ఉక్కపోతతో జనం అల్లాడిపోయేవారు. కానీ ఈ మే నెలలో అనిశి్చత వాతావరణం వల్ల ఎండతోపాటు వర్షాలు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ వేసవిలో ఎక్కడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాలేదు. ఆదివారం నుంచి రోహిణీ కార్తె మొదలైనా, ఎండల తీవ్రత మాత్రం లేకుండాపోయింది. రోళ్లు పగిలే రోహిణీ కార్తెలో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి.

నేటి నుంచి వర్షాలు..
ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది.  

సోమవారం పలు ప్రాంతాల్లో వానలు 
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాచపనుకులులో 56 మిల్లీమీటర్లు, విజయనగరంలో 42.7 మి.మీ, మారేడుమిల్లిలో 41.5 మి.మీ, గంపరాయిలో 34 మి.మీ, నెల్లిమర్లలో 33 మి.మీ, అన్నమయ్య జిల్లా ఎంగిలిబండ, కర్నూలు జిల్లా కామవరంలో 31.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)