Breaking News

ఉద్యోగం కోసం తండ్రిని చంపిన తనయుడు

Published on Thu, 09/04/2025 - 08:01

కర్నూలు జిల్లా: తండ్రి చేస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ ఉద్యోగం తనకు కావాలంటూ కన్న కొడుకే రోకలిబండతో తలపై దారుణంగా కొట్టి హతమార్చిన ఘటన బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తిలో జరిగింది. గ్రామానికి చెందిన రామాచారి (58) ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య విరుపాక్షమ్మతో పాటు, కుమారుడు వీరస్వామి, ఒక కుమార్తె సంతానం. రామాచారి పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. డిగ్రీ వరకు చదివిన వీరస్వామి కొంతకాలం ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసిన అనంతరం గ్రామం చేరుకుని జులాయిగా తిరుగుతున్నాడు. 

తండ్రి రామాచారి చేస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ ఉద్యోగం తనకిప్పించాలంటూ కొంతకాలంగా వీరస్వామి తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం తెలవారుజామున ఉద్యోగం విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుని రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. గమనించిన గ్రామస్తులు కోడుమూరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు  నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతుడి భార్య విరుపాక్షమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)