Breaking News

వీర సైనికా.. మా గుండెల్లోనే ఉంటావిక

Published on Sun, 05/11/2025 - 04:33

గోరంట్ల: జమ్మూ కాశ్మీర్‌లో పాక్‌తో పోరాటంలో మరణించిన వీరజవాన్‌ మురళీ నాయక్‌ భౌతికకాయం శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఆయన స్వగ్రామమైన కల్లి తండాకు చేరుకుంది. నాయక్‌ భౌతికకాయం శనివారం కాశ్మీరు నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరులోని కెంపే­గౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఎయిర్‌పోర్టులో సైనిక అధికారులు, సిబ్బంది ఘన నివాళులరి్పంచారు. రాష్ట్ర మంత్రి సవిత ప్రభుత్వం తరఫున నివాళులరి్పంచారు. అక్కడి నుంచి ఆర్మీ కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన స్వగ్రామానికి తీసుకొచ్చారు.

దారి పొడవునా వేలాదిగా ప్రజలు తరలివచ్చి అమర వీరుడికి జోహార్లు అరి్పంచారు. దీంతో 44వ నంబరు జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. కర్ణాటకలోని బాగేపల్లి, చిక్కబళ్లాపురం, బాగేపల్లి టోల్‌ప్లాజా తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు వేలాదిగా జాతీయ రహదారిపైకి చేరుకుని వీరజవాన్‌కు ఘన నివాళులరి్పంచారు. వందేమాతరం, జై జవాన్‌ నినాదాలు మిన్నంటాయి. భారీ జనం రావడంతో కాన్వాయ్‌ ముందుకు సాగడానికి చాలా సమయం పట్టింది. కర్ణాటక సరిహద్దు దాటి జిల్లాలోకి ప్రవేశించగానే.. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద జవాన్‌ భౌతికకాయం ఉన్న వాహనంపైకి పూలవర్షం కురిపించారు. మురళి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జనం కంటతడి పెట్టారు. కోడూరు థామస్‌ మన్రో తోపు, గుమ్మయ్యగారిపల్లి క్రాస్‌ మీదుగా స్వగ్రామం కల్లి తండాకు భౌతిక కాయం చేరుకుంది.  

స్వగ్రామంలో ఉద్వేగభరిత వాతావరణం 
మురళీ నాయక్‌ భౌతిక కాయం చేరుకోవడంతో స్వగ్రామం కల్లితండాలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు సహా అక్కడ ఉన్న ప్రజలు జవాన్‌ భౌతికకాయానికి కన్నీటితో స్వాగతం పలికారు. వీరజవాన్‌కు నివాళులరి్పంచడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, అధికారులు, నాయకులు భారీగా ఇంటి వద్దకు చేరుకున్నారు. మురళి అమర్‌ రహే అంటూ నినదించారు. వీరజవాన్‌ మురళీ నాయక్‌ కుటుంబాన్ని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్‌ సమంత్, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు శంకరనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. 

నేడు అంత్యక్రియలు 
వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంత్యక్రియలు ఆదివారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)