Breaking News

విద్యుత్‌ తీగకు కేబుల్‌ వైరు తగిలి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని..

Published on Sat, 05/03/2025 - 08:57

మర్రిపాలెం(విశాఖపట్నం): విద్యుత్‌ షాక్‌కు గురై ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధి మురళీనగర్‌లోని అయ్యప్పనగర్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  

జి.వి.పద్మావతి (29) తన భర్త అజయ్‌తో కలిసి అయ్యప్పనగర్‌లో నివాసముంటున్నారు. ఆమె నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తూ, ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న వీరు పాల ప్యాకెట్లను కింద సెల్లార్‌ నుంచి తెచ్చుకోవడానికి ప్లాస్టిక్‌ డబ్బాకు కేబుల్‌ వైరు కట్టి ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఎప్పటిలాగే రెండవ అంతస్తు నుంచి కేబుల్‌ వైర్‌ సహాయంతో సెల్లార్‌లోని పాల ప్యాకెట్లను తీసుకుంటున్నారు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా కేబుల్‌ వైరు విద్యుత్‌ తీగలకు తగిలింది. 

ఇది గమనించని పద్మావతి విద్యుత్‌ షాక్‌కు గురైన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. భర్త అజయ్‌ వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ షేక్‌ సమీర్‌ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూర్మన్నపాలేనికి చెందిన పద్మావతికి నాలుగేళ్ల కిందట అజయ్‌తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అజయ్‌ మిలటరీ ఇంజినీరింగ్‌ సరీ్వస్‌ (ఎంఈసీ)లో కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్నారు.   

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)