Breaking News

డిప్యూటీ సీఎం ఇలాకాలో దళితుల సాంఘిక బహిష్కరణ

Published on Mon, 04/21/2025 - 04:28

పిఠాపురం: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో ఓ చిన్న కారణానికి దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన సంఘటన ఆదివారం వెలుగులోకి వచి్చంది. స్థానికులు, అధికారుల కథనం ప్రకారం.. మల్లాంలో వెలిశెట్టి జల్లిబాబు ఇంట్లో అదే గ్రామానికి చెందిన దళితుడు పల్లపు సురేష్‌ (37) ఈ నెల 16న కరెంటు పని చేస్తూ, విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

సురేష్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఈ నెల 17న దళితులు ధర్నా చేశారు. ఇరు వర్గాల సమక్షంలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌ చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు సమావేశమై, దళితులపై సాంఘిక బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.

కొందరు పెద్దల నిర్ణయం మేరకు తమను పనిలోకి పిలవడం లేదని, ఎవరూ పాలు పోయడం లేదని, హోటళ్లలో కూడా పాలు, టిఫిన్, టీ, కాఫీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమను సాంఘిక బహిష్కరణ చేశారని పలువురు దళితులు పిఠాపురం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు.  

మాకు ఇబ్బంది రాకూడదనే అలా..
‘మా పొలాలు, వ్యాపారాల్లో దళితులు పని చేస్తున్నారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మాపై తప్పుడు కేసులు పెట్టి, డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగా­యి. దీంతో వాళ్లకు ఏ పనీ చెప్పకపోతే ఇబ్బంది ఉండదు కదా అని ఒక నిర్ణయం తీసుకున్నాం’ అంటూ రెండో వర్గం వారు అధికారుల వద్ద స్ప­ష్టం చేశారు. దళితుల సాంఘిక బహిష్కరణ విషయంపై కాకినాడ ఆర్‌డీఓ ఎస్‌.మల్లిబాబు, పిఠా­పురం సీఐ జి.శ్రీనివాస్, ఎస్సై జాన్‌బాషా దళిత కాలనీలోని బాధితులను విచారించారు. 

ఈ సందర్భంగా కాల్దరి భాస్కరరావు మాట్లాడుతూ.. ఆదివారం గ్రామంలో యథావిధిగా చేపలు అమ్మేందుకు ప్రయ­తి్నంచగా బుర్రా రాంబాబు, మేడిది రాజారావులు తన వద్ద ఎవరూ చేపలు కొనొద్దని చెప్పారన్నారు. కలగపూడి ఆమోష్‌ మాట్లాడు­తూ.. బుర్రా నాని, బుర్రా మణికి చెందిన రెండు హోటళ్లలో టిఫిన్‌ కోసం వెళ్లగా తమకు విక్రయించబో­మని చెప్పారన్నారు. 

ఆలపాటి చంద్రరావు మాట్లాడుతూ.. మలిరెడ్డి రాంబాబు దుకాణంలో టీ ఇవ్వలేదని, తమకు టీ అమ్మవద్దని వారి పెద్దలు చెప్పా­రని తెలిపారన్నారు. కాల్దారి శ్రీను మాట్లాడుతూ.. చల్లా వెంకట రమణ పాల కేంద్రం వద్ద పాలు పో­యలేదని చెప్పారు. అనంతరం ఆర్డీవో ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)