Breaking News

ఆరుగురు విద్యార్థులు అదృశ్యం

Published on Sat, 03/29/2025 - 05:38

ఆలమూరు: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా­లోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఒకే రోజు అదృశ్యమయ్యారు. స్కూల్‌కు వెళుతున్నామని చెప్పి నాలుగు రోజులైనా వారు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రు­లు శు­క్రవారం స్థానిక పోలీసులను అశ్రయించారు. ఇప్పటి వరకూ ఇల్లు, స్కూల్‌కు తప్ప వేరే ప్రదేశం తెలియని ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ విద్యార్థులందరూ కనిపించకపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. 

స్థానిక ఎస్సై ఎం.అశోక్‌ కథనం ప్రకారం.. ఆలమూరులోని బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలో కొమరిగిరి కరుణ (8వ తరగతి), కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొమరిగిరి పృథ్వీవర్మ (6వ తరగతి), గంధం సతీష్‌ (8వ తరగతి), మర్రి సంతోష్‌ (7వ తరగతి), కొమరిగిరి పండు (6వ తరగతి), రామచంద్రపురంలోని ఎయిడెడ్‌ స్కూల్‌లో కొమరిగిరి మాధురి (7వ తరగతి) చదువుతున్నారు. 

ఈ ఆరుగురు విద్యార్థులూ ఈ నెల 24వ తేదీన పా­ఠ­శాలలకు యథావిధిగా వెళ్లారు. ఆ తరువాత తిరిగి రా­లేదు. అప్పటి నుంచీ పరిసర ప్రాంతాల్లోను, బంధువుల ఇళ్ల వద్ద ఎంత గాలించినా ప్రయోజనం లేకపో­వడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులందరూ మూ­కుమ్మడిగా పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితి వివరించారు. 

విద్యార్థులందరూ కూడబలుక్కుని వెళ్లిపోయారా లేక వారిలో ఎవరైనా ప్రభావితం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.  ఇప్పటికే ప్రచార మాధ్యమాల్లో ఆ విద్యార్థుల ఫొటో­లు ప్రదర్శించడంతో పాటు వివిధ పోలీసు స్టేషన్లకు సమాచారం అందించినట్లు ఎస్‌ఐ అశోక్‌ చెప్పారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)