Breaking News

‘డిజిటల్‌ అరెస్ట్‌’ కేసులో మరో ఆరుగురు అరెస్ట్‌

Published on Wed, 01/29/2025 - 05:45

తిరుపతి క్రైం: డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో ప్రజలను మోసగిస్తున్న కేసులో మరో ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతి వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలికి ఇటీవల వాట్సాప్‌ ద్వారా ఒక వీడియో కాల్‌ వచ్చింది. 

‘‘నేను ఢిల్లీ నుంచి సీబీఐ అధికారిని మాట్లాడుతున్నాను. రూ.200 కోట్ల మనీల్యాండరింగ్‌ కేసుకు సంబంధించిన వివరాల కోసం సంప్రదించాను’’ అని నమ్మించాడు. వృద్ధురాలి పేరిట ఉన్న బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి చట్ట వ్యతిరేక లావాదేవీలు జరుగుతున్నాయని, అందువల్ల డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నామని భయభ్రాంతులకు గురి చేశారు. వివిధ అకౌంట్లలోకి నగదు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే వాటిని పరిశీలించి, మనీ ల్యాండరింగ్‌ కేసుతో సంబంధం లేకపోతే తరువాత డబ్బులు రిలీజ్‌ చేస్తామని నమ్మించారు. 

వృద్ధురాలు తన ఖాతాలో ఉన్న రూ.2.50 కోట్లు వారు చెప్పిన వివిధ అకౌంట్లలో జమచేసింది. అనంతరం వారు స్పందించకపోవడంతో ఈ నెల 13న వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 22న అప్పటి ఇన్‌చార్జ్‌ ఎస్పీ మణికంఠ రాజమండ్రి కి చెందిన పాలకొల్లు అరుణ్‌ వినయ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. 

అతని వద్ద నుంచి రూ. 24.5 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఓ కారు, రెండు సెల్‌ ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు,  16 గ్రాముల బంగారం కూడా స్వా«దీనం చేసుకున్నట్లు వివరించారు. అదే కేసులో తాజాగా మరో ఆరుగురిని అరె­స్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.­32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, 8 సెల్‌ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, సిమ్‌ మాడ్యూల్‌ను సీజ్‌ చేశామని, మరో రూ. 10 లక్షలు ఫ్రీజ్‌ చేశామని చెప్పారు.

నిందితుల వివరాలు 
1. సింగంపల్లి గణేష్‌(34), త్రినాధపురం, విశాఖపట్నం. 
2. పాలకొల్లు రవికుమార్‌(28), చిన్న వాల్తేరు, విశాఖపట్నం . 
3. యుల్లి జగదీష్‌(37), సత్యనగర్, ఇండ్రస్టియల్‌ ఎస్టేట్, కంచరపాలెం, విశాఖపట్నం. 
4. పెంకి ఆనంద్‌ సంతోష్‌ కుమార్‌ అలియాస్‌ సంతోష్‌ (39), రామ్‌నగర్, శ్రీ హరిపురం, విశాఖపట్నం 
5. ఊటా అమర్‌ ఆనంద్‌ (33), సుజాతా నగర్, గొల్లవెల్లివాని పాళెం, ఎల్‌ఐసి కాలనీ, పెందుర్తి మండలం, విశాఖపట్నం రూరల్‌ 
6. వాసుదేవ్‌(34), మురళీనగర్, విశాఖపట్నం 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)