Breaking News

ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ కేసు

Published on Thu, 06/26/2025 - 08:28

వైఎస్సార్‌సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో కుట్రపూరితంగా తన పేరును చేర్చారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నల్లపాడు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ వేయగా.. ఇవాళ అది విచారణకు రానుంది. 

జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి వైఎస్‌ జగన్‌ వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే దళితుడు మృతిచెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాజకీయ ప్రతీకారంతోనే తనపై ఈ కేసు పెట్టారని జగన్‌ ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు.  

పిటిషన్‌లో ఏముందంటే..

  • మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్‌ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 (హత్య కిందకు రాని కల్పబుల్‌ హోమిసైడ్‌), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు.  

  • మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. 

  • ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్‌పై విడుదల చేశారు.

  • కాన్వాయ్‌లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. 

  • నా పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. 

  • ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. 

  • పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి

మరోవైపు ఇదే వ్యవహారంపై తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్లు వేశారు. మరోవైపు.. మాజీ మంత్రులు పేర్ని నాని , విడదల రజిని హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలు అన్నీ ఇవాళే విచారణకు రానున్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)