అవినీతి ‘సేతు’లతో అనవసర సంతకం

Published on Thu, 08/06/2026 - 06:01

  • సీతానగరం–కనకదుర్గ ఫ్లైఓవర్‌ను అనుసంధానిస్తూ 1.1 కి.మీ.ల పొడవున నిర్మాణానికి డీపీఆర్‌ తయారీకి టెండర్లు

  • అమరావతి–విజయవాడ మధ్య ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం లక్ష్యమంటూ ప్రభుత్వం అబద్ధాలు!

  • ఇప్పటికే వెస్ట్రన్‌ బైపాస్‌లో ప్రకాశం బ్యారేజీకి ఎగువన నాలుగు వరుసల బ్రిడ్జి నిర్మాణం

  • దానికి ఎగువన అమరావతితో హైదరాబాద్‌ రహదారిని అనుసంధానిస్తూ ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికీ డీపీఆర్‌ తయారీ

  • కోల్‌కత–చెన్నై రహదారిని రాజధానిని అనుసంధానిస్తూ సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు విస్తరణ

  • ఇక సిగ్నేచర్‌ బ్రిడ్జి అవసరమేముందని ప్రశ్నిస్తున్న నిపుణులు

  • ప్రకాశం బ్యారేజీ దిగువన ఇప్పటికే 1.5 కిమీల పరిధిలో 3 రైల్వే బ్రిడ్జిలు, రెండు రోడ్డు బ్రిడ్జిలు

  • ఆరో బ్రిడ్జిగా సిగ్నేచర్‌ బ్రిడ్జి నిరి్మస్తే ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వదిలే వరద ప్రవాహానికి అడ్డంకేనంటున్న నిపుణులు

  • గరిష్ట స్థాయిలో వరద వస్తే.. వెనక్కి ఎగదన్ని బ్యారేజీ భద్రతకే ముప్పు అంటూ హెచ్చరిక

  • అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సిగ్నేచర్‌ బ్రిడ్జి నిరి్మంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిలదీత

  • అస్మదీయులకు పనులు కట్టబెట్టి కమీషన్ల వసూలుకే సిగ్నేచర్‌ బ్రిడ్జికి రూపకల్పన చేస్తున్నారంటూ విమర్శలు

సాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిపై సీతానగరం(కుడి గట్టు)–కనకదుర్గ ఫ్లైఓవర్‌(ఎడమ గట్టు)ను అనుసంధానిస్తూ సిగ్నేచర్‌ బ్రిడ్జి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారీకి ఏజీఐసీఎల్‌(అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) ద్వారా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. బిడ్లు దాఖలు చేయడానికి తుది గడువు ఈనెల 26వ తేది. అదే రోజున సాంకేతిక బిడ్, 27న ఆరి్థక బిడ్‌ తెరిచి, డీపీఆర్‌ తయారీ పనులు కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించనుంది. ఆ డీపీఆర్‌ తయారీకి మూడు నెలలు గడువు విధించింది. ఆ డీపీఆర్‌ ఆధారంగా సిగ్నేచర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు

టెండర్లు పిలిచి.. కాంట్రాక్టర్‌కు అప్పగించనుంది. అమరావతి–విజయవాడ మధ్య ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం ఈ సిగ్నేచర్‌ బ్రిడ్జిని నిరి్మంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతిని కోల్‌కత్‌–చెన్నై జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌–16)ను అనుసంధానిస్తూ.. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును కనకదుర్గ వారధి వరకూ విస్తరించే పనులు ఇప్పటికే చేపట్టింది. ఇటు ప్రకాశం బ్యారేజీ మీదుగా అమరావతికి రాకపోకలు సాగించడానికి వీలుగా కరకట్ట రోడ్డు(ఈ–1)ను రెండు వరుసల రహదారిగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సిగ్నేచర్‌ బ్రిడ్జిని నిరి్మంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇంజినీరింగ్‌ నిపుణులు ప్రశి్నస్తున్నారు. అస్మదీయులకు పనులు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికే సిగ్నేచర్‌ బ్రిడ్జికి రూపకల్పన చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

అమరావతికి ఎన్‌హెచ్‌–65తోనూ ఇప్పటికే అనుసంధానం 
విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌ను రాజధాని అమరావతి మీదుగానే ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించింది. ఈ బైపాస్‌లో అంతర్భాగంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన రెండు రెండు వరుసల బ్రిడ్జిలను నిరి్మంచింది. వెస్ట్రన్‌ బైపాస్‌ ద్వారా అటు ఎన్‌హెచ్‌–16.. ఇటు ఎన్‌హెచ్‌–65(విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారి)కి చేరుకోవచ్చు. ఇక రాజధాని అమరావతిని.. ఎన్‌హెచ్‌ 65ను అనుసంధానిస్తూ.. రాజధానిలో ఎన్‌–13 రోడ్డును మూలపాడు వద్ద ఎన్‌హెచ్‌–65తో కలుపుతూ కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికే ఇప్పటికే రూ.4.81 కోట్లు చెల్లించి నిప్పాన్‌ కోయి సంస్థ ద్వారా డీపీఆర్‌ను ఏజీఐసీఎల్‌ తయారు చేయించింది. ఆ ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్‌హెచ్‌–65ను రాజధాని అమరావతితో అనుసంధానిస్తూ కొత్తగా కృష్ణా నదిపై ఎలాంటి బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం లేదని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ.. రాజధాని అమరావతిని ఇటు విజయవాడతోనూ అటు ఎన్‌హెచ్‌–65తోనూ అనుసంధానం చేయడానికి సిగ్నేచర్‌ బ్రిడ్జి నిరి్మంచడానికి ప్రభుత్వం సిద్ధమవడం గమనార్హం.  

ప్రకాశం బ్యారేజీ భద్రతకే ముప్పు 
ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిపై బ్రిటిషు సర్కార్‌ హయాంలో నిరి్మంచిన రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంది. అది వాడుకలో లేకపోయినా ఆ బ్రిడ్జి స్తంభాలు(పియర్స్‌) ఇప్పటికీ ఉన్నాయి. రెండు రైల్వే బ్రిడ్జిలను రైల్వే శాఖ నిర్మించింది. వాటికి కొంత దూరంలోనే ఎన్‌హెచ్‌–16లో అంతర్భాగంగా కృష్ణా నదిపై రెండు రోడ్డు బ్రిడ్జిలను ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నిరి్మంచింది. ఈ ఐదు బ్రిడ్జిలు ప్రకాశం బ్యారేజీ దిగువన 1.5 కిమీల దూరంలోనే విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపాదించిన సిగ్నేచర్‌ బ్రిడ్జి ఆరోది. కృష్ణా నదికి గరిష్ట స్థాయి వరద వచి్చనప్పుడు అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తారు. ఆ వరద ఉద్ధృతికి బ్రిడ్జిల స్తంభాలు అడ్డంకిగా మారుతాయని.. దీని వల్ల ప్రకాశం బ్యారేజీ దిగువన నీటి మట్టం పెరిగి.. వరద వెనక్కి ఎగదన్నే ప్రమాదం ఉంటుందని.. ఇది ప్రకాశం బ్యారేజీ భద్రతకే ముప్పుగా మారుతుందని ఇంజినీరింగ్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)