Breaking News

హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూల్చేస్తారా?

Published on Sun, 06/23/2024 - 05:07

కాశీబుగ్గ: హైకోర్టు ఆదే­శాలు ఉన్నప్పటికీ తాడే­పల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాల­యాన్ని  ఎలా కూల్చివే­స్తా­రని మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలోనే దుర్దినమని అన్నారు. ఆయన శనివారం పలాసలో విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖపట్నం, అనకా­పల్లి, ఇతర వైఎస్సార్‌సీపీ కార్యాలయాలకు నోటీ­సులు పంపిస్తున్నారని అన్నారు. 

‘మీ పార్టీ కార్యా­లయాలకు ఒక తీరు. వేరే పార్టీలకు ఒక తీరా? అలాంటి వాటిపై మాట్లాడితే కేసులు పెడతారా’ అని ప్రశ్నించారు. కూల్చివేతలు మొదలైన చోటే పునర్నిర్మాణాలు మొదలవుతాయని, ఎక్కడైతే వినాశనం మొదలవుతుంతో అక్కడే పునఃసృష్టి జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ తీసేసి యెల్లో పీనల్‌ కోడ్‌ తెచ్చారన్నారు. 

10 శాతం ఓట్లతో పార్లమెంట్‌లో ఇందిరాగాంధీకి ప్రతిపక్ష హోదా కల్పించారని, 40 శాతం ఓట్లు ఉన్న తమకు ప్రతిపక్ష హోదా కల్పించకపోవడం దుర్మార్గ­మని అన్నారు. అసెంబ్లీలో గొంతు విప్పడానికి అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒకటో తేదీన పింఛన్లు, జీతాల కోసం అప్పులకు తిరుగు­తు­న్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ పరిపాలన విధా­నాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.5,340 కోట్లు విడుదలయ్యాయని గుర్తు చేశారు.

‘జగన్‌ ఓడిపో­యాడు.. చచ్చి పోలేదు’ 
వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడికి స్పీకర్‌ పదవి ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. బూతులు మాట్లాడ­టంలో అయ్యన్న టాప్‌ ర్యాంకులో ఉన్నారన్నారు. రైతు భరోసా కేంద్రా­లతో రైతుల వద్దకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వస్తున్నాయని రైతులు సంతృప్తి చెందుతున్నారని, అలాంటి రైతుల గుండెల్లో వైఎస్‌ జగన్‌ స్థానాన్ని తీసేయలేరని అన్నారు. 

వైఎస్‌ జగన్‌ నిర్మించిన ఆర్బీకేల వద్దే టీడీపీ వారు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో పీఏసీఎస్‌ల వద్ద రేయింబవళ్లు వేచి ఉండి పోలీసుల సమక్షంలో పంపిణీ చేసేవారని, విత్తనాల కోసం యుద్ధాలే జరిగేవని, రైతులకు ఆ పరిస్థితులు మళ్లీ తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)