Breaking News

గురువు కరువు!

Published on Mon, 04/07/2025 - 03:58

సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతిష్టాత్మక జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా బోధించేవారు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌­ఈ­ఆర్‌లు, సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు వివిధ రకాల ఉన్నత విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున ఆచా­ర్యుల పోస్టులు ఖాళీగా ఉండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం... ఈ విద్యాసంస్థల్లో మొత్తం 18,940 టీచింగ్‌ పోస్టులు మంజూరు కాగా, 28.56 శాతం ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా ఐఐటీలు, ఎన్‌ఐ­టీలు, ఐఐఎంలలో 2,540 ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు కాగా, 56.18% ఖాళీగా ఉన్నా­యని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ వెల్లడించింది.

బడ్జెట్‌లో 90శాతం జీతాలకే..
⇒ జాతీయ స్థాయి ఉన్నత విద్యాసంస్థలతో­పాటు సెంట్రల్‌ యూనివర్సిటీల్లో టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉండటం అధ్యాపక–­విద్యార్థి నిష్పత్తిని ప్రభావితం చేస్తోందని పార్ల­మెంటరీ స్టాండింగ్‌ కమిటీ అభిప్రాయపడింది. ఇది బోధన నాణ్యతను దెబ్బతీస్తోందని హెచ్చరించింది.

⇒ కాంట్రాక్టు ఉద్యోగాలను దశలవారీగా తొల­గించి, అర్హత కలిగిన అధ్యాపకులను శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వా­లని, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలను ఇచ్చేలా విద్యా మంత్రిత్వశాఖ నిర్మాణాత్మక ప్రణాళికను రూపొందించాలని సూచించింది.

⇒ విద్యార్థుల నమోదు నిష్పత్తికి తగ్గట్టుగా బోధ­న సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది.

⇒ ముఖ్యంగా ఉన్నత విద్యకు కేటాయించిన బడ్జెట్‌లో 90శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే ఖర్చవుతుండటంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించుకునేందుకు శాశ్వత ప్రాతిపది­కన పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధ­తులను అవలంబించడంతో వ్యవస్థలు దెబ్బతింటాయని హెచ్చరించింది. విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారని ప్రశ్నించింది.

⇒ శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియ­మిం­చాలని సూచించింది.  మెరిట్‌ ఆధారంగా, పారదర్శకంగా అధ్యాపక నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం నియామక ప్రక్రియలో ఆన్‌లైన్‌ దరఖాస్తులు, స్క్రీనింగ్, సమాచార మార్పిడి కోసం సాంకేతికతను పెంపొందించాలని, తద్వారా ఇతరుల జోక్యాలను తగ్గించవ్చని స్పష్టంచేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)