Breaking News

సీసీ కెమెరాల్లేవ్‌

Published on Wed, 09/03/2025 - 04:42

సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు పోలీస్‌స్టేషన్లలో సరిపడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని అడ్వకేట్‌ కమిషనర్‌ ఎమ్మార్కే చక్రవర్తి హైకోర్టుకు నివేదించారు. ఉన్న కెమెరాలూ స్టేషన్‌ మొత్తాన్ని కవర్‌ చేయడం లేదని వివరించారు. రాష్ట్రంలోని అన్నీ పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై  జస్టిస్‌ రఘునందన్‌రావు, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్‌ ధర్మాసనం విచారణ జరుపుతోంది. 

ఈ కేసులో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పణకు ధర్మాసనం అడ్వొకేట్‌ కమిషనర్‌ చక్రవర్తిని నియమించింది. మంగళవారం తాజా విచారణ సందర్భంగా అడ్వొకేట్‌  కమిషనర్‌ చక్రవర్తి తన నివేదికను కోర్టుకు సమర్పించారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గుంటూరు జిల్లాలోని అమరావతి, తుళ్లూరు, అరండల్‌పేట, నల్లపాడు పోలీస్‌స్టేషన్లలో సగటున 10 సీసీ కెమెరాలు ఉన్నాయని,  మంగళగిరిలో మాత్రం 11 ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇవి ఎంత మాత్రం సరిపోవని వివరించారు. 

రెండు ఫ్లోర్లు ఉన్న పోలీస్‌స్టేషన్లలో కింది ఫ్లోర్‌లో మాత్రమే సీసీ టీవీలు ఏర్పాటు చేశారని, మరో ఫ్లోర్‌లో వాటిని అమర్చలేదని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీసీ టీవీల లభ్యత విషయంలో ఆయా స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లకు అధికారాలు లేవని, డిజిటల్‌ వీడియో రికార్డర్‌ నుంచి ఫుటేజీ పొందేందుకు ఆయా స్టేషన్ల అధికారులకు అవకాశం లేదని పేర్కొన్నారు. ఏదైనా కేసు దర్యాప్తు, విచారణ విషయంలో సీసీటీవీ ఫుటేజీ కావాలంటే ఎస్పీ కార్యాలయం నుంచి తెప్పించుకోవాల్సి వస్తోందన్నారు. 

అత్యవసరమైతే పాస్‌వర్డ్‌ ఇస్తారని, ఫుటేజీ తీసుకున్న తరువాత ఆ పాస్‌వర్డ్‌ను మార్చేస్తారని పెనమలూరు ఎస్‌హెచ్‌వో తనకు చెప్పారని అడ్వొకేట్‌ కమిషనర్‌ హైకోర్టుకు నివేదించారు. మిగిలిన స్టేషన్లకు వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ లేరని, దీంతో వీడియో రికారి్డంగ్, దాని లభ్యత, డీవీఆర్‌ల నుంచి ఫుటేజీ సేకరణ వంటి వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోయానని చక్రవర్తి తెలిపారు. 

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తిరుమాను విష్ణుతేజ స్పందిస్తూ, డీవీఆర్‌లలో రికార్డ్‌ అయిన ఫుటేజీ ఎక్కడ స్టోర్‌ చేస్తున్నారో తెలుసుకుని చెబుతానన్నారు. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరిస్తూ ఆ మేర విచారణను వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)