Breaking News

పెళ్లి ఇంట మృత్యు గంట!

Published on Sun, 05/11/2025 - 05:09

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌/గన్నవరం రూరల్‌:  చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నవ వరుడు, అతడి బావ మృతి చెందగా, ముగ్గురు చిన్నారులుసహా ఆరుగురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన ఇరువురిలో ఒకరికి గత నెల 30వ తేదీన వివాహమయ్యింది. కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, వీరవల్లి వద్ద శనివారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే,   హనుమాన్‌జంక్షన్‌కు చెందిన మూడెడ్ల స్వామి వెంకట ధీరజ్‌ (37) సీఏ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. 

అతడి చిన్న బావ చీరా నవీన్‌ (35) కెనరా బ్యాంక్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత నెల 30న ధీరజ్‌కు వివాహమైంది. ధీరజ్‌ భార్య రూప (32)తో కలిసి శనివారం సాయంత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. వీరితో పాటుగా ధీరజ్‌ అక్క అలేఖ్య, మరో సోదరి ప్రవల్లిక, ఆమె భర్త చీరా నవీన్‌తో పాటు ముగ్గురు చిన్నారులు కూడా విజయవాడకు కారులో పయనమయ్యారు.  

ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి.. 
మార్గం మధ్యలో వీరవల్లి వద్ద ఎదురుగా అవతలి వైపు రోడ్డులో వేగంగా వస్తున్న కారు ఒకటి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని, ఎగిరి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. అప్పటి వరకూ కారులో సరదాగా మాటలు చెప్పుకుంటూ వెళుతున్న వీరంతా తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. అంబులెన్స్, ట్రక్కు ఆటోలో క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన చిన్నవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ ఆస్పత్రికి తరలించారు. 

ధీరజ్, నవీన్‌ చికిత్స పొందుతూ మృతి చెందారు. ధీరజ్‌ భార్య రూప అపస్మారక స్థితిలో ఉంది. మృతుడు నవీన్‌కు కూడా రెండేళ్ల క్రితమే ప్రవల్లికతో వివాహం కావడం గమనార్హం. అలేఖ్య, ఆమె మూడేళ్ల కుమార్తె హంస్విక (4), కుమారుడు తనుష్‌ ­సాయి (2), ప్రవల్లిక, ఆమె రెండేళ్ల కుమార్తె ఎస్‌.జాని్వక గాయత్రి (1) కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి  చికిత్స పొందుతున్నారు.  

ఎదుటి కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం
ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్, వీడియో­గ్రాఫర్‌ కోసూరు శ్రీనివాసరావు తీవ్ర నిర్లక్ష్య­మే ఈ ప్రమా­దానికి కారణమని ఘటనను బట్టి స్పష్టమవుతోంది. విజయ­వాడకు చెందిన అతడు హనుమాన్‌­జంక్షన్‌లో ఒక శుభ­కార్యానికి వీడియోగ్రఫీ పని నిమిత్తం వస్తు­న్నాడు. శ్రీనివాసరావు కూడా గాయా­ల­పాలై ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మానవత్వం చాటుకున్న వైద్యుడు
రోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను గుర్తించిన డాక్టర్‌ బి.కిషోర్‌రెడ్డి మానవత్వం చాటు­కు­న్నారు. ఈ మార్గంలో కారులో వెళుతున్న హైదరాబాద్‌ ఎమ్మోర్‌ హస్పటల్స్‌ ఎండీ డాక్టర్‌ బి.కిషోర్‌రెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గమనించి హుటాహుటిన కిందకు దిగారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు  ప్రాథమిక చికిత్స అందించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)