అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
పోలీసులు నడిరోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శించవచ్చా?
Published on Thu, 06/05/2025 - 10:32
సాక్షి, అమరావతి: తెనాలి పోలీసులు యువకులను నడిరోడ్డు మీద బూటుకాలితో తొక్కిపెట్టి లాఠీలతో కొట్టిన ఘటనపై సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్ ఎక్స్లో బుధవారం స్పందించారు. పోలీసులు నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. దీన్ని హోంమంత్రి అనిత సమర్థించడాన్ని ఆయన ఆక్షేపించారు. ‘అరికాళ్ల మీద లాఠీలు, మోకాళ్ల మీద తొక్కుడు కాళ్లు అనుభవించిన ఆ యువకులకు కులం లేదు.. లాఠీల తొక్కుడుకాళ్ల భటులకు కులం లేదు, ఒప్పకుందాం.
వాళ్లు ఎస్కోబార్ అంతటి నార్కో డాన్స్, అదీ ఒప్పుకుందాం.. ఏపీ హోం మంత్రికి, ముఖ్యమంత్రి కులం లేదు అదీ ఒప్పుకుందాం’.. కానీ పోలీసులు అట్లా నడిరోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శన చేయవచ్చా? దాన్ని హోంమంత్రి సమరి్థస్తూ మాట్లాడవచ్చా, ముఖ్యమంత్రి కూడా నర్మగర్భంగా సపోర్ట్ చేయవచ్చా? అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్, రఘురామరాజు విషయంలో ఏం మాట్లాడారో మరచిపోవచ్చా అని పేర్కొన్నారు. కులం మరచి, దెబ్బలతో మైమరచి, కేరింతలు కొట్టండి అంటూ ప్రభుత్వానికి చురకలు వేశారు.
Tags : 1