Breaking News

రెండో దశ భూ సమీకరణ నిలిపివేయాలి

Published on Sun, 12/07/2025 - 04:43

గాందీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): రాజధాని అమరావతి పేరిట రెండో విడత భూ సమీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్ర­బాబు ప్రభుత్వాన్ని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. రాజధాని పేరుతో రైతులను ప్రభుత్వం పదే పదే దగా చేస్తోందని మండిపడింది. తొలుత భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసి­ంది. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ‘అమరా­వతి భూ సమీకరణ 2.0’పై రౌండ్‌ టేబుల్‌ సమావే­శం జరిగింది. 

అమరావతి రైతు నాయకులు గద్దె తి­రుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు ఉద్యమ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడు­తూ.. గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతు­ల­కు చంద్రబాబు ఇప్పటివరకు న్యాయం చేయ­­­లే­ద­న్నారు. మళ్లీ రెండో విడత పేరు­తో భూములు తీసుకోవాలని నిర్ణయించడం దారుణమన్నారు. 

24 ప్లాట్‌ఫారాలతో రైల్వేస్టేషన్‌ కడతానంటున్నారని.. నిజంగా అంత పెద్ద రైల్వేస్టేషన్‌ అ­వ­­సరమా? అ­ని ప్రశి్నంచారు. చంద్రబాబు పగటి కల­­లతో రా­ష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అని నిలదీశారు. ఎప్పు­డు నిర్మిస్తారో తెలియని ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు ఇప్పు­డు భూ సమీకరణ అవసరమా? అని ప్రశ్నించారు.

భూ సమీకరణ జీవో చెల్లదు! 
ఔటర్‌ రింగ్‌ రోడ్‌ అంటూ ప్రజలను మోసం చేసి భూములు తీసుకుంటున్నారని ప్రొఫెసర్‌ రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో వెనుక వారి ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతులకు ఇచ్చిన హామీలన్నీ పెద్ద మోసాలన్నారు. రైతులకు విద్య, వైద్యం అందించాలని ల్యాండ్‌ పూలింగ్‌ జీవో చెబుతున్నప్పటికీ అవేవీ కల్పించలేదన్నారు. సమీకరణపై తెచ్చిన జీవో చెల్లదని, దీనిని కోర్టులో సవాల్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అన్‌స్టాపబుల్‌గా భూ సమీకరణ.. 
అమరావతి అన్‌స్టాపబుల్‌ అని చెబుతున్న చంద్రబాబు.. భూ సమీకరణ కూడా అన్‌స్టాపబుల్‌గా చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సచివాలయాన్ని రెండేళ్లు, పార్లమెంట్‌ను మూడేళ్లలో పూర్తి చేశారని.. కానీ మన రాజధాని మాత్రం టీవీ సీరియల్‌లా సాగుతోందని ఎద్దేవా చేశారు. ఒక ప్రాంతంలోనే అంతా ఖర్చు చేస్తున్నారని రాయలసీమ­లో అలజడి మొదలైందని హెచ్చరించారు. 

సామాజిక కార్యకర్త వసుంధర మాట్లాడుతూ.. రెండో విడత భూ సమీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే.. అమరావతి మున్సిపాలిటీగా కాదు.. పంచాయతీగా మిగిలిపోవడం ఖాయ­మ­న్నారు. సమావేశంలో సీపీఐ నేత అక్కినేని వనజ, కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశ్రీ, అమరావతి రైతులు ఎం.రవి, రఘునాథ్, గన్నవరం ఎయిర్‌పోర్టు బాధితులు వేదవతి, శ్రీధర్, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నేతలు పోలారి, తదితరులు పాల్గొన్నారు.  

రైతులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారా?
ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీగా మిగులుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. చంద్రబాబూ.. రైతులను బ్లాక్‌ మెయిల్‌ చేయాలనుకుంటున్నారా? లేదా అవమానించా­లని అనుకుంటున్నారా? అమరావతి రైతులకు చంద్రబాబు ఇప్పటివరకు చేసిందేమీ లేదు.  – బుచ్చి తిరుపతిరావు, అమరావతి రైతు 

చంద్రబాబుకు ప్రణాళిక లేదు 
చంద్రబాబు అమరావతి రైతులను పిలిచి మున్సిపాలిటీ కబుర్లు చెబుతున్నాడు. చంద్రబాబును ఇలాగే వదిలేస్తే రాష్ట్రమంతా భూ సమీకరణ చేస్తాడు. అసలు చంద్రబాబుకు ప్రణాళిక లేదు. అమరావతి రైతులంతా కలిసి చంద్రబాబు మెడలు వంచాలి.  – రాజేంద్రప్రసాద్, రైతు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)