Breaking News

కాపురం చేస్తూనే.. రెండో పెళ్లికి సిద్ధం

Published on Tue, 08/12/2025 - 07:41

తూర్పు గోదావరి: ఓ మహిళతో కాపురం చేస్తూనే.. పెళ్లి పేరుతో మరో యువతిని మోసం చేసేందుకు యత్నించి, తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. సీఐ బీఎన్‌ పట్నాయక్ వివరాల మేరకు, గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతికి, దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పాలి వీరవెంకట సత్యనారాయణతో ఇటీవల వివాహం కుదిరింది. సోమవారం తెల్లవారుజామున స్థానిక ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం వధువు ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు చేశారు. 

మరో గంటలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు కనిపించడంలేదంటూ వధువు బంధువులకు రాత్రి ఏడు గంటల సమయంలో సమాచారం వచ్చింది. దీంతో కంగారు పడిన ఆమె బంధువులు అసలు వివరాలు సేకరించారు. అంతకు ముందే సత్యనారాయణకు పెళ్లయి, కాపురం చేస్తున్నాడని, అందుకే పెళ్లికి రాకుండా అదృశ్యమైనట్టు సమా చారం అందింది. దీంతో వధువు కుటుంబానికి న్యా యం చేయాలంటూ ఆమె బంధువులు ఆందోళన చేశా రు. సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ పట్నాయక్ తెలిపారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)