Breaking News

రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్‌

Published on Wed, 10/11/2023 - 10:52

సాక్షి, గుంటూరు: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణం కేసులో రెండో రోజు నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ విచారిస్తోంది. మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలపై సీఐడీ వరుస ప్రశ్నలు సంధించింది.

లోకేష్‌కు సీఐడీ ప్రశ్నలు
ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పుకి ఒత్తిడి చేశారా లేదా?. మీరు మంత్రి అవ్వగానే మంత్రి వర్గ ఉప సంఘంలో ఎందుకు చేర్చారు?. మంత్రి వర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను ఒత్తిడి చేశారా కదా..?. హెరిటేజ్‌, లింగమనేని, నారాయణ భూములకు లబ్ధి చేసేలా అలైన్‌మెంట్‌ ఎందుకు మార్చారు?. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉంది కదా?. భూ సేకరణ వ్యయాన్ని 210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు?. లింగమనేని రమేష్‌ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు’’ అంటూ లోకేష్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.

5 గంటల పాటు పునీత్‌ను విచారించిన సీఐడీ అధికారులు
ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లడు పునీత్‌ను సీఐడీ అధికారులు ఐదు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో భాగంగా సీఐడీ ఎదుట హాజరైన పునీత్‌ను అధికారులు ప్రశ్నించారు. రేపు(గురువారం) మళ్లీ విచారణకు రావాలని పునీత్‌ను అధికారులు ఆదేశించారు. 

కాగా, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా ఉన్న లోకేశ్‌.. తొలిరోజు పొంతనలేని సమాధానాలు చెప్పారు. నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. లోకేష్‌కు  30 ప్రశ్నలు వేసిన సీఐడీ అధికారులు.. హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న సమంయలో లోకేష్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించారు.

అయితే, సీఐడీ సంధించిన సూటి ప్రశ్నలకు తత్తరపాటుకు గురై బిత్తరపోవడం లోకేశ్‌ వంతైంది. మాజీ సీఎం చంద్రబాబు తరహాలోనే ఆయన తనయుడు నారా లోకేశ్‌ కూడా సీఐడీ దర్యాప్తునకు సహకరించకుండా మొండికేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. అయితే  సీఐడీ అధికారులు పూర్తి ఆధారాలతో ప్రశ్నించేసరికి తడబాటుకు గురై అసహనం ప్రదర్శించారు.

న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ లోకేశ్‌కు సమీపంలో న్యాయవాది ఉండేందుకు అవకాశం కల్పించి మరీ విచారించారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిని బట్టి సీఐడీ అధికారులు ఒక్కో ప్రశ్న అడుగుతూ విచారణ కొనసాగించారు. సుహృద్భావ వాతావరణంలో విచారణ ప్రక్రియ కొనసాగించేందుకు ప్రాధా­న్యమిచ్చారు. లోకేశ్‌ సహకరించడం లేదని స్పష్టమవుతున్నా ఓపిగ్గా ప్రశ్నలు సంధిస్తూ ఆరు గంటల పాటు విచారించారు.
చదవండి: తత్తరపాటు.. బిత్తర చూపులు! 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)