‘మరో గంటలో వస్తాం’.. ఆ మాటలే చివరివా?

Published on Tue, 07/07/2026 - 10:38

సాక్షి, విశాఖపట్నం: కడుపు నింపిన కడలమ్మే.. ఇప్పుడు ఆ కుటుంబాల కళ్లలో కన్నీటి సముద్రాన్ని నింపుతోంది. ’మరో గంటలో వచ్చేస్తాం..’ అంటూ ఫోన్‌లో వినిపించిన మాటలే చివరి మాటలుగా మిగిలిపోతాయేమోనన్న భయం ఆ కుటుంబాలను క్షణక్షణం కుంగదీస్తోంది. గంటలు రోజులుగా మారుతున్నా.. సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఒకవైపు నేవీ, కోస్ట్‌గార్డ్‌ బృందాలు సముద్రాన్ని జల్లెడ పడుతుండగా.. మరోవైపు తీరాన కుటుంబ సభ్యులు ఆశ, ఆందోళనల మధ్య ప్రతి అలను చూస్తూ తమవారి కోసం ఎదురు చూస్తున్నారు. 

అణువణువూ గాలిస్తున్నా.. 
జూలై 1వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్నారు. వారిలో కారె చిన్న మినహా మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన మత్స్యకారుల కోసం తూర్పు నౌకాదళం, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్, కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు సంయుక్తంగా ముమ్మర గాలింపు చేపట్టారు.

కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఐసీజీఎస్‌ కనకలతా బారువా, ఐసీజీఎస్‌ వీరా నౌకలతో పాటు నేవీకి చెందిన మరో రెండు యుద్ధనౌకలు సముద్రంలో గాలిస్తున్నాయి. వీటికి తోడు ఒక డోరిమాన్ విమానం, ఒక సీకింగ్‌ హెలికాప్టర్, ఒక ఏఎల్‌హెచ్‌ హెలికాప్టర్‌ కూడా సెర్చ్‌ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు గగనతలం నుంచి గాలించినప్పటికీ గల్లంతైన వారి జాడ లభించలేదు. ఎల్రక్టానిక్‌ సర్వేలెన్స్‌తోనూ సముద్రాన్ని అణువణువూ గాలిస్తున్నా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. 

మత్స్యశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన 
ప్రభుత్వం, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించలేదంటూ మత్స్యకార కుటుంబాలు సోమవారం మత్స్యశాఖ జేడీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి.  

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)