Breaking News

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ తేదీల్లో విజయవాడ పరిధిలో పలు రైళ్లు రద్దు

Published on Wed, 09/17/2025 - 16:58

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన విడుదల చేసింది. ఏపీలో విజయవాడ  పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. మరికొన్నింటికి రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగవచ్చని తెలిపింది. వీటిలో ప్రధానంగా గుంటూరు-విశాఖ మధ్య నడిచే రైళ్లే ప్రధానంగా ఉన్నాయి. 

దసరా నేపథ్యంలో.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. అయితే పండుగ తర్వాతే ఈ అంతరాయం ఉంటుందని తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. విజయవాడ డివిజన్‌ పరిధిలో విజయవాడ-దువ్వాడ నూతన బ్రిడ్జిల నిర్మాణ పనుల వల్లే ఈ అంతరాయం అని తెలిపింది.

రాజమండ్రి-విశాఖ మధ్య ప్రయాణించే రైలు నంబర్ 67285 ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి రాజమండ్రికి ప్రయాణించే రైలు నంబర్ 67286 ను కూడా నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 17239(సింహాద్రి ఎక్స్ ప్రెస్) ను నవంబర్ 22 నుంచి 24 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి గుంటూరుకు ప్రయాణించే రైలు నంబర్ 17240 (సింహాద్రి ఎక్స్ ప్రెస్)ను నవంబర్ 23 నుంచి 25 వరకూ రద్దు చేశారు.

కాకినాడ పోర్టు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 17267ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి కాకినాడ పోర్టుకు ప్రయాణించే రైలు నంబర్17268 ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. విశాఖ నుంచి విజయవాడకు ప్రయాణించే రైలు నంబర్ 12717 (రత్నాచల్ ఎక్స్ ప్రెస్) ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విజయవాడ నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 12718 (రత్నాచల్ ఎక్స్ ప్రెస్)ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. వీటితో పాటు.. 
 
సీఎస్ఎంటీ ముంబై నుంచి భువనేశ్వర్ కు ప్రయాణించే రైలు నంబర్ 11019ను నవంబర్ 21న 180 నిమిషాల పాటు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు. ధన్ బాద్ నుంచి అలప్పుజకు వెళ్లే రైలు నంబర్ 13351ను నవంబర్ 24న 180 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేశారు. అలాగే హతియా నుంచి ఎర్నాకుళం వెళ్లే రైలు నంబర్ 22837ను కూడా 160 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేశారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)