Breaking News

బడికెళ్లే వయసులో ప్రేమ! ఏంటి రా ఇది

Published on Fri, 11/28/2025 - 13:03

కృష్ణలంక(విజయవాడతూర్పు): వారిద్దరు మైనర్లు. ఒకే పాఠశాలలో బాలిక తొమ్మిదో తరగతి, బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ప్రేమ అనే ఆకర్షణకు లోనైన ఆ ఇద్దరు కలసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రాణిగారితోట, సిద్దెం కృష్ణారెడ్డి రోడ్డులోని ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో యూపీ కుటుంబానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి, రాణిగారితోటకు చెందిన బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. బుధవారం బాలుడి పుట్టినరోజు కావడంతో స్కూల్‌కు వెళ్లనని ఇంటిలో చెప్పి తండ్రి ఫోన్‌ తీసుకుని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. స్కూల్‌కు వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక ఇంటి నుంచి బయలుదేరి స్కూల్‌కు వెళ్లకపోగా తిరిగి ఇంటికి చేరుకోలేదు. 

వారి తల్లిదండ్రులు స్కూల్‌ సిబ్బందిని, చుట్టు          పక్కల, బంధువులను విచారించినా ఆచూకీ లభించలేదు.        వెంటనే పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ఇద్దరు కలిసి బస్టాండ్‌కు చేరుకుని హైదరాబాద్‌ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా హైదరాబాద్‌ పరిసరాల్లో ఉన్నట్లు నిర్ధారించుకున్న సీఐ నాగరాజు తన సిబ్బంది అక్కడకు పంపి మైనర్లను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారివారి తల్లిదండ్రులకు అప్పగించారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)