Breaking News

నేడో, రేపో డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌!

Published on Wed, 08/20/2025 - 06:05

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 అభ్యర్థుల మెరిట్‌ జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్‌ మార్కుల సవరణకు ఈనెల 17వ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైనవారి జాబితా సైతం సిద్ధమైంది. ఇక మిగిలింది తుది జాబితా విడు­దల మాత్రమే. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ప్రభు­త్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లా­ల్లో డీఎస్సీ విధుల్లోకి సిబ్బందిని నియమించారు. 

సీనియర్‌ హెచ్‌ఎంలు, ప్రిన్సిపల్స్, ఎంఈవోలకు ఈ విధులను అప్పగించారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 పోస్టు­లు భర్తీచేయనున్నారు. అంతేసంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచే అవకాశం ఉంది. డీఎస్సీ పరీక్షలకు పిలిచిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో దాదాపు 60 వేలమంది అభ్యర్థులు తమ టెట్‌ మార్కులను తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించారు. దీంతో వారి మార్కులను వారే సవరించుకోవాలని రెండుసార్లు విద్యాశాఖ అవకాశం కల్పించింది. చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో మెరిట్‌ లిస్ట్‌ విడుదల అనంతరం జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీనియర్‌ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. తుది మెరిట్‌ లిస్ట్‌లో ఉన్నవారిలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే, జాబితాలో తర్వాత ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుని పోస్టింగ్‌ ఇస్తారు. డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లు వచ్చేనెల 5వ తేదీ నాటికి విధుల్లో ఉండేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)