Breaking News

బుల్‌ స్వారీలో ‘ఆమె’ జోరు

Published on Mon, 01/06/2025 - 04:04

సాక్షి, అమరావతి: స్టాక్‌ మార్కెట్లో బుల్‌ స్వారీ చేయడానికి మహిళా ఇన్వెస్టర్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా లాక్‌ డౌన్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

ఆర్థిక సంవత్సరం 2022 తర్వాత ప్రారంభమవుతున్న ప్రతి నాలుగు డిమ్యాట్‌ అకౌంట్లలో ఒకటి మహిళా ఖాతాగా ఉన్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి సగటున ఏటా మూడు కోట్ల ఖాతాలు ప్రారంభమవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా డిమ్యాట్‌ ఖాతాలు ప్రారంభం కావడం గమనార్హం. 2014లో దేశం మొత్తం మీద 2.2 కోట్ల ఖాతాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 17 కోట్లు దాటింది. 

ముఖ్యంగా కోవిడ్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూల ద్వారా రూ.12,068 కోట్ల నిధులు సేకరిస్తే, 2024లో రూ.1.60 లక్షల కోట్లు స్టాక్‌ మార్కెట్‌ ద్వారా సేకరించడం గమనార్హం. సిప్‌ విధానం ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏటా రూ.రెండు లక్షల కోట్లకుపైగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేస్తున్నారు.   

రాష్ట్రంలో 22.7% మహిళా ఇన్వెస్టర్లు  
మహిళా ఇన్వెస్టర్లు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. గత మూడేళ్లలో హిమాచల్‌ ప్రదేశ్‌ 3.7% వృద్ధితో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌ 3.2% వృద్ధితో రెండవ స్థానంలో నిలిచింది. 2022లో మొత్తం ఇన్వెస్టర్లలో మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 19.5% ఉండగా, అది ఇప్పుడు 22.7 శాతానికి పెరిగింది. జాతీయ సగటు 23.9% పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ, గత మూడేళ్లుగా రాష్ట్రంలో మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్టు ఎస్‌బీఐ రీసెర్చ్‌ తన నివేదికలో పేర్కొంది. 

పెద్ద రాష్ట్రాల్లో ఢిల్లీ 29.8%, మహారాష్ట్ర 27.7%, తమిళనాడు 27.5%తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు కూడా కలుపుకుంటే గోవా 32%తో మొదటి స్థానంలో ఉంది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి. కోవిడ్‌ తర్వాత నుంచి స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టే 30 ఏళ్లలోపు వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2018లో మొత్తం ఇన్వెస్టర్లలో 22.9 శాతంగా ఉన్న 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య ఇప్పుడు 40 శాతానికి చేరుకుంది. కొత్తగా ఇన్వెస్ట్‌ చేస్తున్న వారిలో అత్యధికంగా హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్‌ వంటి పట్టణ ఇన్వెస్టర్లు ఉంటున్నట్లు ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)