Breaking News

మరో వివాదంలో ఆదిమూలం.. ఆడియో లీక్‌

Published on Mon, 10/14/2024 - 11:23

తిరుపతి జిల్లా, సాక్షి: తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. అసభ్య పదజాలంతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల వరలక్ష్మీ అనే మహిళపై లైంగిక దాడి ఘటన మరువక ముందే ఆదిమూలం మరో వివాదంలో చిక్కుకున్నారు.

‘‘ కలర్ మారిపోయావు. పర్సనాలిటీ పెరిగిపోయింది. అప్పటికి ఇప్పటికి బ్యూటిఫుల్‌గా ఉన్నావు. అప్పటికి ఇప్పటికీ సూపర్‌ ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు’’ అంటూ ఓ మహిళతో మాట్లాడిన ఆడియో క్లిప్  సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. 

ఇలా అసభ్యకరంగా మహిళతో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోయారు. గత నెలలో వరలక్ష్మి అనే మహిళపై లైంగిక దాడి ఘటనలో అడ్డంగా దొరికిపోయినా.. ఆయన మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్నారు. తాజాగా బయటపడిన ఆడియో క్లిప్‌ విషయంలో.. ఎమ్మెల్యే తీరుపై నియోజవర్గం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీబీ పురం మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించిన విషయం తెలిసిందే. బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా.. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసినా చంద్రబాబు, లోకేశ్‌ న్యాయం చేయకపోవడంతో.. ఇక ‘ఆత్మహత్య చేసుకుంటున్నా’నంటూ సోషల్‌ మీడియాలో ఆమె పెట్టిన పో​స్ట్‌ తీవ్ర దుమారం రేపింది.

చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)