Breaking News

నకిలీ మద్యం సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే

Published on Mon, 10/06/2025 - 03:43

సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా ములకల­చెరువు వద్ద భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్నది ముమ్మాటికీ ప్రభు­త్వ పెద్దలేనని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దందానేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరా­బాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేత సురేంద్రనాయుడు పాత్రధారి మాత్రమే­నని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయట­పెట్టా­లని.. సీఎం చంద్రబాబు ఈ దందాకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!?..
ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా హైవే పక్కనే ఓ పరిశ్రమను తలపించేలా నకలి మద్యా­న్ని ఎలా తయారు చేయగలరు? ఈ ప్రభుత్వ పెద్దలు గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేంటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్న దుర్మార్గాలేంటి? నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!? ఏ బ్రాండ్‌ కావాలంటే ఆ బ్రాండ్‌తో రోజుకు 30 వేల క్వార్టర్‌ బాటిళ్లు తయారుచేసి, మద్యం షాపులకు, బెల్టు షాపులకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకు­న్నారు.

పైగా.. వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే.. పెద్దఎత్తున లిక్కర్‌ స్కాం జరుగుతోందని కూటమి పార్టీలు, ఎల్లో మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయి. మరి ఇవాళ ములకల­చెరువులో భారీగా బయటపడ్డ నకిలీ మద్యం గురించి టీడీపీ కూటమి ప్రభు­త్వం, ఈ ఎల్లో మీడియా ఏం సమాధానం చెబు­తాయి? అప్పుడు మద్యం తాగినవాళ్లందరికీ లివర్లు, కిడ్నీలు పాడై­­పో­యాయని అన్నా­రుగా.. ఇప్పుడు పాడవవా? ఇక నిన్న అరెస్టైన సురేంద్రనాయుడు ఏ నాయకుడికి ముడుపులిస్తే ఈ దందా జరుగుతుందో సమాధానం చెప్పాలి.

ములకలచెరువులోనే ఐదేళ్లలో రూ.500 కోట్ల దందా..
ఇదిలా ఉంటే.. ఈ నకిలీ మద్యంతో కూడిన క్వార్టర్‌ బాటిల్‌ తయారీకి రూ.8   లేదా రూ.9 ఖర్చవుతుంది. అదే బాటిల్‌ను బెల్టుషాపుల వారికి రూ.110కి అమ్మితే వా­ళ్లు రూ.130కి అమ్ముతున్నారు. అంటే ఒక్కో బాటిల్‌ మీద రూ.100 ఆదాయం వస్తోంది. ఒక్క ములకలచెరువులో ఒక రోజులో 30 వేల బాటిళ్ల నకిలీ మద్యం తయారవుతుండగా రూ.30 లక్షల అక్రమార్జన జరుగుతోంది. ఇలా ఏడాదికి రూ.100 కోట్లు, ఐదేళ్లలో రూ.500 కోట్లు దండుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఇంకెన్ని చోట్ల నకిలీ మద్యం తయారుచేస్తున్నారో ప్రజలకు తెలియాలి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)