Breaking News

దళిత సర్పంచ్‌పై అధికార జులుం

Published on Sat, 12/20/2025 - 04:48

సాక్షి టాస్క్ ఫోర్స్‌: తన స్థలంతోపాటు రైతుసేవా కేంద్రం దారిని ఆక్రమంచి టీడీపీ సానుభూతిపరుడు నిర్మించిన ప్రహరీని కూల్చేసిన ఎస్సీ వర్గీయుడైన సర్పంచ్‌పై కేసుపెట్టి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన వైనమిది. బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన అధికారపార్టీ నేతలు, అధికారుల వైఖరికి అద్దం పడుతోంది. బాధిత సర్పంచ్‌ నగేశ్‌ తెలిపిన మేరకు.. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రభుత్వస్థలంలో రైతుభరోసా కేంద్రం నిరి్మంచారు. దానికి దారికోసం సర్పంచ్‌ నగేశ్‌ సర్వేనంబరు 127/7 లోని తన స్థలంలో ఐదడుగులు ఇచ్చారు. 

ఆ పక్కనే నివాసం ఉంటున్న టీడీపీ సానుభూతిపరులు టి.వెంకాయమ్మ, శ్రీనివాసరావు దంపతు­లు ఇటీవల రైతుసేవా కేంద్రానికి వెళ్లే రహదారిలో కొంత, నగేశ్‌ పట్టాభూమిలో కొంత ఆక్రమించి ప్రహరీ కట్టేందుకు పిల్లర్లు వేశారు. దీంతో సర్పంచ్‌ ఆ స్థలాన్ని సర్వేచేయాలంటూ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. తహసీల్దార్‌ ఆదేశాలతో సర్వేయర్‌ వచ్చి స్థలాన్ని సర్వేచేసి టీడీపీ సానుభూతిపరుడు గోడకట్టే ప్రదేశంలో ఆక్రమణ ఉందని నివేదిక ఇచ్చారు. 

ఈ విషయం చెప్పి సర్పంచ్‌ హెచ్చరించినా వినకుండా వారు గోడకట్టారు. సర్పంచ్‌పై దాడిచేసి కులం పేరుతో దూషించారు. ఆ విషయమై సర్పంచ్‌ రెండురోజుల కిందట ఎస్పీకి, జేసీకి ఫిర్యాదు చేశారు. ఎవరూ స్పందించకపోవడంతో సర్పంచ్‌ నగేశ్‌ ఆ అక్రమ గోడను యంత్రంతో కూల్చేశారు. దీంతో తన గోడను సర్పంచ్‌ కూల్చేశారని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడి ప్రోద్బలంతో శుక్రవారం నగేశ్‌ స్థలంలో నుంచి విద్యుత్‌ సిబ్బంది కరెంటు స్తంభాలు వేయసాగారు. వారిని నగేశ్‌ అడ్డుకున్నారు. వారి సమాచారంతో గ్రామానికి వెళ్లిన సీఐ సుబ్బరాజు గోడ కూల్చినందుకు తీసుకెళ్తున్నానంటూ సర్పంచ్‌ నగేశ్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

ఈ విషయమై సీఐ సుబ్బరాజును అడగగా.. ఆక్రమణ విషయమై కోర్టులో తేల్చుకోవాల­ని, పడేయడం క్రిమినల్‌ కేసు అవుతుందని చె­ప్పా­రు. అందుకే తీసుకొచ్చి 41 నోటీసు ఇచ్చి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాన్ని కబ్జాచేసి గోడ నిరి్మంచినా పట్టించుకోని అధికారులు.. ఆ గోడ తొలగించారని సర్పంచ్‌పైనే కేసు పెట్ట­డం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)