Breaking News

జీతాలు ఇప్పించండి బాబూ!

Published on Tue, 07/14/2026 - 04:14

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ‘రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కూడా సరిగా కల్పించడం లేదు. కనీస వేతనాలు ఇవ్వడం లేదు. కుటుంబాలను ఎలా పోషించాలి?’ అంటూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్‌)లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసనకు దిగారు. కొత్త ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించే సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కష్టాలను ఏకరవు పెట్టారు.

వార్డుల్లో అన్ని పనులు తామే చేయాలని, తమకు సంబంధంలేని పనులూ చేయిస్తున్నారని ఆరోపించారు. జీతాలు సైతం సక్రమంగా ఇవ్వడంలేదని, రెండు నెలలుగా పెండింగ్‌లో ఉంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని మండిపడ్డారు. ప్రభుత్వం చొరవ చూపి న్యాయం చేయాలన్నారు. అనంతరం కార్మికులను పోలీసులు కలెక్టరేట్‌లోకి అనుమతించగా, డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశకు అందించారు.

అన్ని పనులూ చేయిస్తున్నారు 
అన్ని పనులూ చేయిస్తున్నారు. సంబంధం లేని పనులు చేయడంతో పని ఒత్తిడి పెరుగుతుంది. భోజనం కూడా చేయనీయడం లేదు. సంబంధం లేకున్నా బెడ్‌షీట్‌లు మార్పిస్తున్నారు. రోగులు బెడ్‌పై  విరోచనానికి వెళ్తే ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు చేయాల్సిన పనులు కూడా మాతోనే చేయిస్తున్నారు.    – మణి, పారిశుద్ధ్య కార్మికురాలు

సక్రమంగా జీతాలు చెల్లించాలి
జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. రెండు, మూ­డు నెలలకు ఒకసారి ఇస్తే కుటుంబా­ల­ను ఎలా పోషించుకో­వాలి. ప్రతిసారి జీతాల కోసం నిరసన చేయాల్సిన దుస్థితి నెలకొంది. కనీస వేతనం అమలు చేయడం లేదు. పీఎఫ్, ఈఎస్‌ఐ కూడా సక్రమంగా చెల్లించడం లేదు. 
– అఖిల, పారిశుద్ధ్య కార్మికురాలు  

Videos

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)