Breaking News

తిరోగమన‘మే’

Published on Thu, 06/19/2025 - 04:44

సాక్షి, అమరావతి: ఈ ఏడాది మే నెలలోనూ రాష్ట్ర సంపద తిరోగమనంలోనే సాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర సంపద పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచడంలో మాత్రం గణనీయ ప్రగతి కనబరుస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలైన ఏప్రిల్, మే నెల వరకు కాగ్‌ వెల్లడించిన బడ్జెట్‌ గణాంకాలను పరిశీలిస్తే  జీఎస్టీతోపాటు ఆమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం తగ్గిపోయింది. 

ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లోనే ఏకంగా రూ.22,505 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. జీఎస్టీ, అమ్మకం పన్ను తగ్గిపోతోందంటే ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోందనడానికి బలమైన సంకేతమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో వృద్ధి నమోదవుతుందని, లేదంటే ఆదాయం తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. 

గత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు వచ్చిన జీఎస్టీ ఆదాయం కన్నా.. ఈ ఏడాది మే నెల వరకు వచ్చిన ఆదాయం రూ.350 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను కూడా రూ.136 కోట్లు పడిపోయింది.  పన్నేతర ఆదాయమూ రూ.49 కోట్లు తగ్గిపోయింది. కేంద్ర నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులూ ఏకంగా రూ.1300 కోట్లు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నా.. గ్రాంట్లను తీసుకురావడంలో విఫలమైంది.  

ఇతర రాష్ట్రాల్లో పెరుగుదల.. ఇక్కడ తగ్గుదల  
సాధారణంగా జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో ఏటా ఎంతో కొంత పెరుగుదల కనిపిస్తుంటుంది. అయితే ఈ ఏడాది ఎలాంటి విపత్కర పరిస్థితులు లేకున్నా.. జీఎస్టీ, పన్నుల ఆదాయం తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

జీఎస్టీ రాబడి మిగతా రాష్ట్రాల్లో పెరుగుతుండగా రాష్ట్రంలో తగ్గుతోందని, దీనికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మరో పక్క ఈ ఏడాది ఏప్రిల్, మే రెండు నెలల్లోనే రూ.22,505 కోట్లు అప్పు తెచ్చినా.. మూలధన వ్యయం మే నెల వరకు రూ.2,242 కోట్లు మాత్రమే చేయడం కూడా ఆందోళన కలిగించే అంశమనే వాదన వినిపిస్తోంది. 

గత ఆర్థిక సంవత్సరం మేనెల వరకు విద్య, వైద్య, సంక్షేమం తదితర సామాజిక రంగాలపై చేసిన వ్యయంతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా రూ.6,184 కోట్లు తగ్గిపోయింది. సామాజిక రంగ వ్యయమూ సాధారణంగా గతం కన్నా  పెరగాలి. అయితే అందుకు భిన్నంగా తగ్గిపోవడం గమనార్హం. 

సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు గత ఆర్థిక సంవత్సరం సంపద సృష్టించకపోగా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపారు. ఈ ఆర్థిక సంవత్సరమూ రెండు నెలల్లోనే భారీగా అప్పులు చేశారు. ఇదే విషయాన్ని కాగ్‌ గణాంకాలూ స్పష్టం చేస్తున్నాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)