Breaking News

‘సాక్షి’కి ఆపాదించడం సరికాదు

Published on Sun, 06/08/2025 - 05:32

సాక్షి, అమరావతి: సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్‌ఆర్‌ లైవ్‌ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ‘సాక్షి’ టీవీ స్పష్టం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను తనకు ఆపాదిస్తూ కూ­టమి నేతలు చేస్తున్న ప్రకటనలను సాక్షి టీవీ తీవ్రంగా ఖండించింది. తాము ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలను చూపుతామని తెలిపింది. సీనియర్‌ జర్నలిస్ట్‌ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ ఎంత మాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని వెల్లడించింది.

‘సాక్షి’ మొదటి నుంచీ కూడా మహిళల పట్ల అత్యంత గౌరవంగా వ్యవహరిస్తోంది. మహిళల వికాసానికి, వారి అభ్యున్నతికి సంబంధించి అనేక ప్రత్యేక కథనాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తోంది. పాత్రికేయ విలువలకు కట్టుబడి పని చేస్తున్న ‘సాక్షి’ ఏనాడు గీత దాటలేదు. పాత్రికేయ చట్టాలు, నిబంధనల పరిధిలో ప్రజలకు వాస్తవాలను వెల్లడిస్తోంది. దీంతో.. ‘సాక్షి’ని నేరుగా ఏమీచేయలేకపోతు­న్నామనే బాధలో ఉన్న టీడీపీ, దాని అనుబంధ ఎల్లో మీడి­యా, ‘సాక్షి’కి ఏమాత్రం సంబంధంలేని వ్యాఖ్యలను చూపించి కుట్రలకు తెర తీస్తుండటం దారుణం అని పలువురు సీనియర్‌ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్‌ఆర్‌ లైవ్‌ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని ‘సాక్షి’ టీవీ స్పష్టం చేసినప్పటికీ ఇంకా ఏదో రాద్ధాంతం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యలను ‘సాక్షి’కి ఆపాదిస్తూ, సంస్థ ప్రతిష్టను దిగజార్చే పన్నాగంతో టీడీపీ సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుండటం సరికాదంటున్నారు.  

దురుద్దేశంతో ‘సాక్షి’పై టీడీపీ కుట్రలు 
‘సాక్షి’ కార్యాలయాలపైకి తన మూకలను ఉసి­గొల్పి సంస్థను ఇబ్బంది పెట్టాలని టీడీపీ వ్యూహ రచన చేస్తుండటం సరికాదని, ఇది కొత్త విష సంస్కృతికి దారి తీస్తుందని సీనియర్‌ జర్నలిస్టులు హెచ్చ­రిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభు­త్వం కొలువుదీరి ఏడా­దైనా, ఫలానా మంచి పనులు చేశామని చెప్పుకునేందుకు ఏమీ లేక సతమతమ­వు­తోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుండటంతో ఎలాగైనా దాన్ని డైవర్ట్‌ చేసేందుకు ఎప్పటి లాగే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపింది.

ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం విజయవాడ ‘సాక్షి’ కార్యాలయం వద్దకు కొంత మందిని పంపించి గొడవ చేయించింది. ‘సాక్షి’కి మహిళలంటే గౌరవ­మని, కృష్ణంరాజు వ్యాఖ్యలను ఎంత మాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని పోలీసుల సమక్షంలో వారికి స్పష్టం చేయడంతో ఆందోళన విరమించి వెళ్లిపోయారు. అయినా కూడా శనివారం రాత్రి పొద్దుపోయాక కూడా టీడీపీ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం కొనసాగింది. పైగా ఆదివారం రాష్ట్రంలోని అన్ని ‘సాక్షి’ కార్యాలయాల వద్ద ఆందోళనలకు సన్నాహాలకు పిలుపునిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంత మాత్రం సరికాదని సీనియర్‌ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)