వైఎస్సార్‌సీపీపై కక్ష సాధింపే టీడీపీ కూటమి టార్గెట్‌

Published on Wed, 11/26/2025 - 04:47

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీపై కక్షసాధింపే టీడీపీ కూటమి సర్కారు టార్గెట్‌ అని, ఆ నినా­దాన్ని భుజానికెత్తుకుని తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆరి్డనేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆ దిశలోనే కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్స్‌తో కాన్సిపిరసీ థియరీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. అందులో నుంచి వచ్చినవే  తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి , పరకామణి, లిక్కర్‌ వంటి కేసులు అని వెల్లడించారు. 

ఏ ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసులు నమోదు చేసి ఎవరో ఒకరిని అరెస్టు చేయడం, బెదిరించడం.. ఆ తర్వాత వాంగ్మూలాలు నమోదు చేయడం.. వాటి ఆధారంగా టార్గెట్‌ లిస్ట్‌లో ఉన్న వారిపై కేసులు పెడుతూ, వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధిస్తున్నారని.. అదే సీఎం చంద్రబాబు నమ్ముకున్న కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీ అని సజ్జల మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..  

నెయ్యిపై ఏ ఆధారాలతో సిట్‌ విచారణ?..
2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్‌ చేసే వాళ్లం. కానీ, ఏనాడూ మేము కక్షపూరితంగా వ్యవహరించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంటూ, ఏ ఆధారాలతో సిట్‌ ద్వారా విచారణ చేయిస్తుందో అర్థం కావడం లేదు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేస్తున్న సిట్, 2014–19 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపైనా విచారణ చేస్తే అసలు నిజాలు తెలుస్తాయి. 2019 –24 మధ్య కేజీ నెయ్యి రూ.320 చొప్పున సేకరిస్తేనే కల్తీ అన్న నాయకులు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.270కే సేకరించినప్పుడు కల్తీ జరిగినట్లు కాదా? ప్రభుత్వాలు మారినా టీటీడీలో దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవస్థల ప్రకారమే టెండర్ల నిర్వహణ, క్వాలిటీ చెకింగ్‌ జరుగుతుంది. 

పరకామణి చోరీ అంటూ కేసు పెట్టి, వైఎస్సార్‌సీపీ నాయకులను ఇరికించే ఉద్దేశంతోనే విచారణ పేరుతో ఏవీఎస్‌వో సతీష్‌ కుమార్‌ను సిట్‌ వేధించింది. ఆ బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మేం మాట్లాడితే.. ఆధారాలు లేకుండానే హత్యగా ప్రచారం చేసిందే కాకుండా వైఎస్సార్‌సీపీ నాయకులే చంపించారని మాపై బురదజల్లారు.

రిజెక్ట్‌ చేసిన నెయ్యిని ఎలా వాడారు?..
‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలైలో క్వాలిటీ చెక్‌ తర్వాత నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్‌ చేసి వెనక్కి పంపారని చెబుతున్నారు. వెనక్కి పంపిన నెయ్యిని తిరిగి తీసుకొస్తే వాడినట్టు సిట్‌  రిపోర్టులో ఉంది. అలాంటప్పుడు రిజెక్ట్‌ చేసిన నెయ్యినే కూటమి ప్రభుత్వంలో ఎలా వాడారు? 

టీడీపీ హయాంలో జరిగిన తప్పునకు చంద్రబాబు బాధ్యత తీసుకోరా? లిక్కర్‌ కేసులో ఇన్నాళ్లుగా విచారణ చేస్తున్న ప్రభుత్వం ఏం సాధించినట్టు? న్యాయస్థానాల దగ్గర విచారణ పేరుతో మా నాయకులను అదుపులోకి తీసుకుని నెలల తరబడి  జైలు­పాలు చేశారు.’’ అని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

ఎస్‌ బ్యాంకులో టీటీడీ నిధుల జమ నియమాలకు విరుద్ధం కాదా?
‘‘ప్రైవేట్‌ బ్యాంకులో 10 శాతానికి మించి టీటీడీ నిధులు డిపాజిట్‌ చేయకూడదనే నిబంధన ఉంది. కానీ టీటీడీ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి ఎస్‌ బ్యాంక్‌ అనే ప్రైవేట్‌ బ్యాంకులో రూ.1300 కోట్లకు పైగా జమ చేశారు. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌ అయ్యాక దాన్ని జాతీయ బ్యాంకుల్లోకి మార్చారు. ఎస్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేసిన దానికి చంద్రబాబే కారణమని మేం ఆరోపించామా? కుట్ర రాజకీయాలు చేశామా?’’ అని సజ్జల ప్రశ్నించారు. 

లాయర్‌కు రూ.8 కోట్ల ఫీజు!
‘‘చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వాది­ంచిన లాయర్‌ సిద్దార్థ లూథ్రాని తీసుకొచ్చి వైఎస్సార్‌సీపీ నాయకుల మీద బనాయించిన అక్ర­మ కేసులన్నీ ఆయనకే అప్పజెప్పారు. ఈ కేసులకు ఆయనకు ఇప్పటి వరకు రూ.8 కోట్లకు పైగా జనం సొమ్మును ఫీజు కింద చెల్లించారు’’ అని సజ్జల విమర్శించారు.   

కేసుల క్లోజర్‌ కుట్ర!
‘‘సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగంతో కేసులు క్లోజ్‌ చేయించుకునే కుట్ర చేస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంతోపాటు,  బార్లకు ప్రివిలేజ్‌ ఫీజు రద్దు కేసులను మాఫీ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక బాబుపై ఉన్న అన్ని కేసులూ మళ్లీ బయటకు తీస్తాం.’’ అని రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.

ఎందుకంత కడుపు మంట?
‘‘తెలంగాణలో బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం మాకేంటి. వైఎస్‌ జగన్‌ సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు.  2014 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే వైఎస్సార్‌సీపీకి 7శాతం ఓట్లు వచ్చాయి. అయినా తెలంగాణ రాజకీయాలు వద్దనుకుని వచ్చిన మాకు బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్‌ జగన్‌కు జనాదరణ పెరుగుతుంటే టీడీపీ, ఎల్లోవీుడియాకు ఎందుకంత కడుపుమంట?’’ అని సజ్జల ప్రశ్నించారు.

కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన
‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో తీసుకొచి్చన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను  ప్రైవేటుపరం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందుకే వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో భారీగా పాల్గొని సర్కారుపై గళమెత్తుతున్నారు. కోటి సంతకాల సేకరణ గొప్ప ప్రజా ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోతుంది.’’ అని సజ్జల పేర్కొన్నారు.  

ఒక్క ఇల్లు కట్టించకపోయినా క్రెడిట్‌ చోరీ..
‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో పూర్తి చేసిన 3 లక్షల ఇళ్లను కూటమి ప్రభుత్వంలో ఇచ్చినట్టు చెప్పుకోవడం దారుణం. పేదల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా క్రెడిట్‌ చోరీకి పాల్పడటం సిగ్గుచేటు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌ అయ్యారు.

అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే..
‘‘చంద్రబాబు తల్లి అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే. లోకేశ్‌ పక్కనే ఉన్నారు కాబట్టి ఆ కథనే చాగంటి మరో రకంగా చెప్పారు. గూగుల్‌ డేటా సెంటర్‌కి సంబంధించి అదానీ పేరెత్తితే వైఎస్‌ జగన్‌ కి క్రెడిట్‌ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు కిక్కురుమనడం లేదు. విశాఖలో అనామక కంపెనీలకు బాబు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. అదే హెరిటేజ్‌ ఆస్తులైతే అంత తక్కువ ధరకు ఇస్తారా?’’ అని సజ్జల నిలదీశారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)