Breaking News

వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక​ చంద్రబాబు కుట్రలు: సజ్జల

Published on Sat, 03/07/2026 - 13:59

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, కెమికల్‌ కలిపారని దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు ప్లాన్‌. వైఎస్సార్‌సీపీ హయాంలో క్వాలిటీ టెస్టింగ్‌ ల్యాబ్‌ను తీసుకొచ్చాం. మార్కెట్లో ఫిబ్రవరి 24న కేజీ హెరిటేజ్‌ నెయ్యి రూ.541 ఉంది. అదే రోజు మార్కెట్‌లో ఇందాపూర్‌ నెయ్యి రూ.578గా ఉంది. కేజీ అమూల్‌ నెయ్యిని రూ.525కే ఇస్తున్నారు’ అని సజ్జల తెలిపారు.

అడ్డగోలుగా దోపిడీ చేయటానికే.. 
తిరుమల లడ్డూపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘నెయ్యి కాంట్రాక్టును కైవసం చేసుకోవటానికే ఇష్టానుసారం మాట్లాడారు. అధిక ధరలతో నెయ్యి కాంట్రాక్టు తీసుకుని స్వామి వారి సొమ్మును కాజేస్తున్నారు. అడ్డగోలుగా దోపిడీ చేయటానికే లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల వెనుక పెద్ద స్కాం ఉంది.

స్వామి వారి డబ్బును దోచుకోవటానికి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. లడ్డూ ఇష్యూలో ప్లాన్ ప్రకారమే మా పార్టీపై బురద చల్లారు. లడ్డూ కాంట్రాక్టు వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉంది. దీనిపై సీబీఐ విచారణ జరపాలి. అప్పుడే కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. అమరావతిలో జరుగుతున్న స్కాం మదరాఫ్ ఆల్ స్కామ్స్. నెయ్యి ఇష్యూ అంతకంటే పెద్ద స్కాం. సెప్టెంబరు 18న నెయ్యి గురించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

జంతువుల కొవ్వు ఉందని అనడమే దారుణం అనుకుంటే బాత్రూమ్ కెమికల్స్ కలిపారని కూడా చంద్రబాబు మళ్లీ మాట్లాడారు. సాధారణ మనుషులు ఎవరూ ఊహించని మాటలతో అందరినీ ఆందోళనకు గురి చేశారు. దీనంతటి వెనుక భారీ స్కాం చేయటానికి పన్నిన కుట్ర దాగి ఉంది. 2023లో జగన్ తిరుమలలో అత్యాధునిక ల్యాబులను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటిది ఒక్కటీ చేయలేదు.  

జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ కుట్ర.. బాబు స్కామ్‌ల చరిత్ర..

బీఆర్ నాయుడి వ్యవహారం బయటపడినా ఆయనను చంద్రబాబు ఎందుకు తొలగించలేదు? మా హయాంలో పృథ్వీ విషయం తెలియగానే రాజీనామా చేయించాం. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. భక్తుల విశ్వాసాలంటే చంద్రబాబుకు లెక్క లేదని అర్థం అయింది’ అని ధ్వజమెత్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)