Breaking News

రైతు భరోసా కేంద్రాలు అద్భుతం: రాజస్థాన్‌ రాష్ట్ర సీడ్స్‌  కార్పొరేషన్‌ ఎండీ

Published on Mon, 04/10/2023 - 07:32

తిరుపతి రూరల్‌: క్షేత్రస్థాయిలోనే రైతు సమస్యలకు ఉత్తమ పరిష్కార కేంద్రంగా ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు) అద్భుతమని రాజస్థాన్‌ రాష్ట్ర సీడ్స్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) జస్వంత్‌సింగ్‌ కొనియాడారు. ఆయన ఆదివారం రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన అగ్రికల్చర్‌ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి తిరుపతి జిల్లా తిరుపతి రూరల్‌ మండలం దుర్గసముద్రంలోని ఆర్‌బీకేని సందర్శించారు.

వ్యవసాయ శాఖాధికారులు, రైతులతో మాట్లాడారు. ఆర్‌బీకేలో రైతుల సంక్షేమం, అధిక దిగుబడి కోసం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న నాణ్యమైన క్రిమిసంహారిక మందులు, రైతులకు సీజన్ల వారీగా అందిస్తున్న సేవలను తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ప్రసాద్‌రావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఆర్‌బీకేలో కియోస్క్‌ పనితీరు, వివిధ అవసరాలకు రైతులు కియోస్‌్కను ఉపయోగించుకుంటున్న విధానాన్ని వారు ఆసక్తిగా పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌బీకేలను ఏర్పాటు చేసిన తర్వాత వ్యవసాయ, పశుసంవర్ధకశాఖల అధికారులు రోజూ అందుబాటులో ఉంటున్నారని, విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించామని రైతులు తెలిపారు.

అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ జస్వంత్‌సింగ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఆర్‌బీకే వంటి పథకాలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోందని చెప్పారు. అందులో భాగంగానే వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో వాటిని పరిశీలించేందుకు వచి్చనట్లు తెలిపారు. నిజంగానే ఆర్‌బీకేలు రైతులకు అద్భుతంగా సేవలు అందిస్తున్నాయని కితాబిచ్చారు. ఈ విషయమై తమ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖాధికారి సంగన మమత, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ అయేషా, రైతులు పాల్గొన్నారు.
చదవండి: అన్ని ఆర్బీకేల్లో యంత్ర సేవా కేంద్రాలు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)