Breaking News

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం.. చుక్కలు చూపిస్తున్న గ్రామీణ రోడ్లు

Published on Mon, 12/08/2025 - 12:08

బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌: మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మామూలు రోజుల్లోనే రహదారులు గుంతలమయంగా ఉంటాయి. అలాంటిది గతవారం రోజులుగా జోరు వర్షాలు కురవడంతో పట్టణంలోని రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 16వ వార్డులోని చెన్నూరు రోడ్డు నుంచి రాజుపాళెం రోడ్డు వైపు ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రయాణించాలంటే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. 

ఈ రహదారి వెంబడి తహసీల్దార్‌ కార్యాలయం, గ్రంథాలయం, అంబేడ్కర్‌ భవన్, బెజవాడ గోపాల్‌రెడ్డి పార్కు, సామాజిక ఆరోగ్యం కేంద్రం, పోలీస్‌స్టేషన్, ఎస్పీ బాలు వసతి భవనం, డీఎల్‌ఎన్నార్‌ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. నిత్యం కొడవలూరు మండలం రాజుపాళెం, బుచ్చిలోని రూరల్‌ ప్రాంతాల నుంచి ఈ రహదారిపై వేల మంది ప్రయాణిస్తుంటారు. అధికారులు ఇదే దారిన వెళ్తుంటారు. అ యినా రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

మలిదేవి కాలువ నుంచి శివాలయం వరకు.. 
మరోపక్క చెన్నూరురోడ్డులోని మలిదేవి కాలువ వద్ద నుంచి శివాలయం వరకు రోడ్డుపై అడుగుకో గుంత కనిపిస్తోంది. వాహనదారులు, పాదచారులు ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ఈ రోడ్డుపై వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పర్యటన ఈ ప్రాంతాల వద్ద ఉందంటే మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత పరిస్థితి షరామామూలే.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత 
మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని ఆ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ బిట్రగుంట ప్రమీలమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకుడు నారాయణ తహసీల్దార్‌ అంబటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాళెం నుంచి రాజుపాళెం వైపు వెళ్లే రోడ్డు, మలిదేవి కాలువ నుంచి శివాలయం వరకు అధ్వానంగా ఉన్న రోడ్లను వెంటనే నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆర్‌అండ్‌బీ ద్వారా గానీ, మున్సిపల్‌ కమిషనర్‌ ద్వారా కానీ శాశ్వతంగా రోడ్లు నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని తహసీల్దార్‌ను కోరినట్లు వివరించారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)