Breaking News

మా పార్టీ అధికారంలో ఉంది.. దిక్కున్న చోట చెప్పుకోండి

Published on Fri, 02/06/2026 - 05:32

ఒంగోలు టౌన్‌: జిల్లా కేంద్రమైన ఒంగోలు నార్త్‌ బైపాస్‌లోని హెచ్‌సీజీ క్యాన్సర్‌ ఆస్పత్రి వెనక ఉన్న కార్మిక నగర్‌ను బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు నేలమట్టం చేశారు. సుమారు 200 మంది ప్రైవేటు సైన్యం, మూడు జేసీబీలను తీసుకొచ్చి కాలనీపై విరుచుకు పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. ముక్తినూతలపాడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 186లో సుమారు 12 ఎకరాల ఈనాం భూములు ఉన్నాయి. గత 11 ఏళ్లుగా కూలినాలి చేసుకునే కొందరు నిరుపేదలు రేకుల షెడ్లు, గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాలనీలో విద్యుత్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు లేనప్పటికీ కాలం వెళ్లదీస్తున్నారు. 

ఇటీవల కార్మికనగర్‌లో భూముల విలువ భారీగా పెరిగింది. ఎకరం రూ.12 కోట్ల చొప్పున పలుకుతుండడంతో అధికార పార్టీకి చెందిన బడా నాయకుల కన్నుపడింది. శరవేగంగా తెరవెనుక తతంగం నడిపించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 7 గంటల సమయంలో టీడీపీ నేతలు తమ ప్రైవేటు సైన్యంతో కార్మిక నగర్‌లోకి ప్రవేశించారు. అక్కడ 60 ఇళ్లల్లో నివాసం ఉండే నిరుపేదలకు ఏం జరుగుతుందో తెలియలేదు. 

చీకట్లోనే  జేసీబీలతో ఇళ్లను వరుసగా నేలకూల్చారు. అడ్డు వచ్చిన వారిని బెదిరించడంతో పాటు దాడికి దిగారు. ఒక ఇంటిని తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. కేవలం గంటన్నర లోపే కాలనీలో షెడ్లు, గుడిసెలు నేలమట్టయ్యాయి. బాధితుల రోదనలు మిన్నంటినా పట్టించుకునే వారు లేరు. మహిళలు అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. కనీసం సామాన్లు సర్దుకునేందుకు సమయం ఇవ్వమంటూ కాళ్లు చేతులు పట్టుకుని బతిమాలినా వినలేదని బాధిత మహిళలు రోదిస్తున్నారు.  

అడ్డు వస్తే మనుషులను కూడా కూల్చేస్తాం.. 
‘ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది.. ఇప్పుడు కాకపోతే మరోసారి ఈ భూములను తీసుకోలేం.. మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’ అని బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కేవలం ఇళ్లను మాత్రమే కూల్చేశాం.. రేపు అవసరమైతే మనుషులను కూడా ఇలాగే కూల్చేస్తామని హెచ్చరించినట్లు బాధితులు వాపోయారు. ఇదంతా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

ఈ విధ్వంసం జరుగుతున్న సమయంలో ఒక మహిళా ఏఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ విషయమై తాలుకా సీఐ విజయకృష్ణను విచారించగా డయల్‌ 100కు ఫోన్‌ వస్తే తమ సిబ్బంది వెళ్లారని, ఏదో భూవివాదం జరుగుతుండడంతో తమకు సంబంధం లేదని.. వెనక్కి వచ్చేశారని చెప్పారు. జేసీబీల విషయం తమకు తెలియదని.. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)