Breaking News

ఒకే కుటుంబం.. రాజకీయ విరోధం!

Published on Thu, 10/26/2023 - 08:04

సాక్షి, భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబంలోని వారు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. ఇలా అధికారం కోసం బద్ధ వైరులుగా మారిన వారిలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీల నేతలున్నారు. నవంబర్‌ 17వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో తోబుట్టువులు, మామ– మేనల్లుడు, బావమరుదులు, అల్లుళ్లు, అత్తలు, మామలు..ఇలా రాజకీయ ప్రత్యర్థులుగా రంగంలోకి దిగారు.

నర్మదాపురం స్థానంలో బీజేపీ అభ్యరి్థ, అసెంబ్లీ స్పీకర్‌ సీతాశరణ్‌ శర్మపై స్వయానా ఆయన సోదరుడు గిరిజాశంకర్‌ శర్మ కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయిన గిరిజా శంకర్‌ సొంత పార్టీ టిక్కెట్‌ నిరాకరించడంతో ఇటీవలే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. మరో ఉదాహరణ..సాగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌కు చెందిన నిధి సునీల్‌ జైన్, తన బావ, సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యే శైలేంద్ర జైన్‌పై పోటీకి దిగారు.

శైలేంద్ర జైన్‌ చిన్న తమ్ముడు సునీల్‌ జైన్‌ భార్యే నిధి జైన్‌. దియోరి నియోజకవర్గ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సునీల్‌ జైన్‌. అదేవిధంగా, రేవా జిల్లా డియోతలాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పద్మేష్‌ గౌతమ్‌ను పోటీకి నిలిపింది. ఈయన మామ, బీజేపీకి చెందిన ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్‌ గిరీశ్‌ గౌతమ్‌ ఇక్కడ పోటీ చేస్తున్నారు. హర్దా జిల్లా తిమారి్నలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి సంజయ్‌ షాపై ఆయన మేనల్లుడు అభిజీత్‌ షా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ ముఖాముఖి తలపడటం ఇది రెండోసారి.

గ్వాలియర్‌ జిల్లా దాబ్రాలో బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఇమార్తి దేవిపై ఆమె బంధువు సిట్టింగ్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సురేశ్‌ రాజేతో తలపడుతున్నారు. ఇమార్తి దేవి మేనకోడలు రాజే కుటుంబంలో కోడలిగా ఉన్నారు. కుటుంబసభ్యులు ఎన్నికల్లో పరస్పరం తలపడటంపై సీనియర్‌ జర్నలిస్ట్, వ్యాఖ్యాత ఆనంద్‌ పాండే మాట్లాడుతూ..‘ఇది సైద్ధాంతిక సంఘర్షణ కానే కాదు. కేవలం అధికారం, పదవుల కోసం జరిగే పోరాటం’అని పేర్కొన్నారు.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)