Breaking News

నెల్లూరులో ఆర్టీసీ బస్సు చోరీ

Published on Thu, 07/24/2025 - 03:29

నెల్లూరు సిటీ/ఆత్మకూరు: నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ఓ వ్యక్తి బస్సును చోరీ చేయడంతో దాదాపు రెండు గంటల పాటు ఆర్టీసీ అధికారులు హైరానా పడ్డారు. చివరికి ఫాస్ట్‌ట్యాగ్‌తో బస్సు ఆచూకీ కను­గొన్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీ­రాము­లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు ఏఎస్‌పేట నుంచి మంగళవారం సాయంత్రం ప్రయా­ణికులతో బయ­లుదేరి నైట్‌ హాల్ట్‌గా నెల్లూ­రు బస్టాండ్‌కు చేరింది. బుధవారం ఉదయం 5 గంటలకు తిరిగి ఏఎస్‌­పేటకు బయలుదేరాల్సి ఉంది. డ్రైవర్, కండెక్టర్‌ బస్టాండ్‌లోనే నిద్రపోయారు. 

ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బుధవారం తెల్లవారు జాము­న బస్సును అపహరించాడు. 4 గంటలకు నిద్రలే­చిన కండక్టరు, డ్రైవర్‌ బస్టాండ్‌లో బస్సు కనిపించకపోవడంతో ఆత్మకూరు, నెల్లూరు డిపో మేనే­జర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు టోల్‌­గేట్ల సిబ్బందిని అప్రమత్తం చేశా­రు. అధికారులు బస్సు ఆచూకీ కోసం ప్రయత్ని­స్తుండగా, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజా వద్ద సంగం వైపు క్రాస్‌ అయినట్లు ఫాస్ట్‌ట్యాగ్‌ మెసేజ్‌ వచ్చింది. సంగంలో బస్సును ఆపేందుకు ప్రయత్నించగా ఆగలేదు. 

నెల్లూరుపాళెం సెంటర్‌ వద్దకు వచ్చిన బస్సును పలువురు చాకచక్యంగా నిలిపి బస్సు నడిపిన వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఆత్మకూరు ఎస్సై ఎస్‌కే జిలానీకి ఫిర్యాదు చేశారు. బస్సును చోరీ చేసిన వ్యక్తిని విడవలూరు మండలం కంచరపాళెంకు చెందిన కృష్ణగా గుర్తించారు. అతనికి మతిస్థిమితం లేదని తెలిపారు. నెల్లూరు పోలీసులకు, ఆర్టీసీ అధికా­రు­లకు సమా­చారం ఇచ్చారు. కృష్ణను నెల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు ఎస్సై జిలానీ తెలిపారు. 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)