Breaking News

విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత చంద్రబాబుదే

Published on Fri, 09/05/2025 - 05:00

సీతంపేట: ‘విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.’ అని అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల నేతలు స్పష్టంచేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం విశాఖపట్నం ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో అఖిలపక్ష రాజకీయ, ప్రజాసంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ ‘చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత ముఖ్యమంత్రిదే అని చెప్పారు. ఇప్పుడు ప్రైవేటీకరణను ఆపాల్సిన బాధ్యత చంద్రబాబుదే.

ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒకేమాటపై నిలబడ్డాయి. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు మోదీ ముందు సాగిలపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వారిపై ఆధారపడి ఉంది. కేంద్రాన్ని విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా నిలదీసి తెలుగు ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలి. ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు, 1,400 మంది శాశ్వత ఉద్యోగులను తొలగించినా, 44 విభాగాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచినా కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడామని పాలకులు చెప్పడం హాస్యాస్పదం.

విశాఖ ఉక్కు కర్మాగారం గురించి దు్రష్పచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ అనడం సరికాదు. ప్రధాని మోదీని ఒప్పించి ప్రైవేటీకణ ఆపే దమ్ము మాధవ్‌కు ఉందా?. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఈ నెల 12న విజయవాడలో సమావేశం పెట్టాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు’ అని పేర్కొన్నారు.    

పవన్‌కళ్యాణ్‌ జవాబు చెప్పాలి 
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉప్పు, కారం తినడం లేదా? అని పవణ్‌కళ్యాణ్‌ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఉప్పు కారం తింటున్నారో.. లేదో జవాబు చెప్పాలి. పవన్‌కళ్యాణ్‌ విశాఖ వచ్చి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఆయన రుషికొండ భవనంలో పెచ్చులు ఊడిపోతున్నాయని మీడియాను తీసుకెళ్లి డ్రామాలాడటం హాస్యాస్పదం. స్టీల్‌ప్లాంట్‌ కార్మికులను తొలగిస్తే అడ్డుకోవాల్సిన టీడీపీ ప్రజాప్రతినిధులు.. రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షలు డబ్బులిచ్చి చాలామంది ఉద్యోగాల్లోకి వచ్చా­రని చెప్పడం దుర్మార్గం’ అని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జీవీఎంసీలో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర ప్రజాసంస్థ కన్వినర్‌ వీవీ రమణమూర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఏవీ వర్మరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్‌కేఎస్‌వీ కుమార్, సీపీఐ ఎంఎల్, ఏఐటీయూసీ, స్లీట్‌ ప్లాంట్‌ గుర్తింపు సంఘం, వివిధ ప్రజా, కార్మిక సంఘాల నాయకులు వై.కొండయ్య, గణేష్ పాండా, కె.దేవా, డి.ఆదినారాయణ, ఆర్‌.రవీంద్రనాథ్, ఏజే స్టాలిన్, ఎం.పైడిరాజు మాట్లాడారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)