Breaking News

మోస్ట్‌ వాంటెడ్‌ నిందితులను పట్టిచ్చిన ‘రోబో’

Published on Wed, 02/04/2026 - 10:13

 విశాఖపట్నం: రైల్వే స్టేషన్‌ అంటేనే నిత్యం వేలాది మందితో కిటకిటలాడే ఒక జనసముద్రం. ఆ రద్దీలో సామాన్య ప్రయాణికులను, మారువేషంలో తిరిగే నేరగాళ్లను వేరు చేసి చూడటం మానవమాత్రులకు కత్తిమీద సామే. కానీ.. ఆధునిక సాంకేతికత తోడైతే అసాధ్యం సుసాధ్యమని ‘రైల్‌ రోబోకాప్‌ – ఏఎస్‌సీ అర్జున్‌’ నిరూపించింది. సోమవారం నిశ్శబ్దంగా సాగిపోతున్న రాత్రి వేళ, ప్లాట్‌ఫారంపై తన గస్తీని కొనసాగిస్తున్న ఈ రోబో రూపంలోని కృత్రిమ మేధస్సు ఒక్కసారిగా అప్రమత్తమైంది.

 దాని డిజిటల్‌ కళ్లు రద్దీలో ఉన్న ప్రతి ముఖాన్ని నిశితంగా స్కాన్‌ చేస్తుండగా, ఇద్దరి వ్యక్తుల ముఖకవళికలు తన డేటాబేస్‌లోని ‘మోస్ట్‌ వాంటెడ్‌’ జాబితాతో సరిపోలాయి. కనురెప్పపాటు కాలంలోనే ఆ రోబో తన విశ్లేషణను పూర్తి చేసి, కంట్రోల్‌ రూమ్‌కు ప్రమాద హెచ్చరికలను పంపింది. అప్పటివరకూ సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రోబో పంపిన నిక్కచ్చి సమాచారంతో ఆరీ్పఎఫ్‌ ఎస్‌ఐ వి. కీర్తిరెడ్డి నేతృత్వంలోని బృందం, క్రైమ్‌ ప్రివెన్షన్‌ డిటెన్షన్‌ స్క్వాడ్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ఎటు నుంచి ముప్పు వస్తుందో ఊహించలేక ఆ ఇద్దరు అనుమానితులు తచ్చాడుతుండగానే, పోలీసులు వారిని చుట్టుముట్టారు. ప్రాథమిక తనిఖీలో వారి వద్ద కనీసం టికెట్లు కూడా లేకపోవడం అధికారుల అనుమానాన్ని బలపరిచింది.

అయితే అసలు సంచలనం వారి గతాన్నితవ్వినప్పుడు బయటపడింది. పట్టుబడిన హడప శివ, జె. బంగారు సాధారణ దొంగలు కాదని, రాయగడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగతనాలు, దోపిడీలు, దాడులు, డకాయిటీలతో భీభత్సం సృష్టించిన గజదొంగలని తేలింది. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఈ నేరగాళ్ల ఆటను ‘ఏఎస్‌సీ అర్జున్‌’ తన ఏఐ మేధస్సుతో కట్టిపడేసింది. ఈ చారిత్రాత్మక విజయంపై డీఆర్‌ఎం లలిత్‌ బోరా స్పందిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించడంలో ఏఐ సాంకేతికత ఒక తిరుగులేని ఆయుధమని ప్రశంసించారు.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)