గరుడ ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. మోహన్ బాబు వర్సిటీ విద్యార్థి మృతి

Published on Sat, 09/13/2025 - 12:02

సాక్షి, తిరుపతి: తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ క్రమంలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్ సమీపంలోని గరుడ వారధి ఫ్లైఓవర్‌పై శనివారం ఉదయం రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న చక్రధర్‌, వేదాంత్‌ ఇద్దరూ బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్‌ అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, విద్యార్థి చక్రధర్‌(19) అక్కడికక్కడే మృతి చెందగా.. వేదాంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్న తిరుమల ఈస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిద్దరినీ రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)