Breaking News

వెంటాడిన మృత్యువు!

Published on Wed, 03/15/2023 - 15:34

ప్రకాశం: గుంటూరులో బంధువులను పరామర్శించి తిరిగి వస్తున్న ఓ కుటుంబాన్ని మత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టి బోల్తాపడటంతో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో ఇద్దరు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పూతలపట్టు మండలం పాలకూరు సమీపంలో చోటుచేసుకుంది. 

పోలీసుల కథనం మేరకు.. పామూరు మండలం, తాతయ్యపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి(50), భార్య రామ సుబ్బమ్మ(43) కర్ణాటకలోని హల్సూర్‌లో స్థిరపడ్డారు. కుమార్తె కీర్తిరెడ్డి(25), కుమారుడు వంశీ(23)తో కలిసి బెంగళూరులో పీజీ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. గతేడాది కుమార్తెకు సీఎస్‌పురం మండలం జంగవారిపల్లికి చెందిన çసాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హరీష్‌తో వివాహం చేశారు. ఇతను కూడా బెంగళూరులోనే ఉంటూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. 

గుంటూరులో ఉంటున్న సుబ్బమ్మ ఆడపడుచు భర్తకు గుండెపోటు రావడంతో భర్త, కుమార్తెతో కలిసి అల్లుడి కారులో గుంటూరు వెళ్లారు. సోమవారం రాత్రి 9 గంటలకు బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో మంగళవారం తెల్లవారుజామున పూతలపట్టు మండలం పాలకూరు వద్ద ముందు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీని వీరి కారు అదుపుతప్పి ఢీకొట్టింది. 

కారు బోల్తా పడి నుజ్జునుజ్జయింది. రామసుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందగా హరీష్, వెంకటేశ్వర్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన కీర్తిరెడ్డి(25)ని 108 ఆంబులెన్సులో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వేలూరులోని సీఎంసీకి తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్‌ పేర్కొన్నారు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?