Breaking News

లేడీ డాక్టర్‌ కారు బీభత్సం

Published on Mon, 07/13/2026 - 05:37

ఒంగోలు టౌన్‌ :  లేడీ డాక్టర్‌ కారు అదుపు తప్పడంతో ఓ కానిస్టేబుల్‌ ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలో రెండ్రోజులుగా గైనకాలజిస్టుల రాష్ట్రస్థాయి వార్షిక సదస్సు జరుగుతోంది. పాండిచ్చేరిలో పీజీ చేస్తున్న నగరానికి చెందిన డాక్టర్‌ మేఘ ఈ సదస్సులో పాల్గొనడానికి ఒంగోలు వచ్చారు. ముంగమూరు సెంటర్‌లో స్నేహితులతో కలిసి కాఫీ తాగి ఆ తర్వాత బయల్దేరారు. కారు నగరంలోని పాత ఎన్‌హెచ్‌–5 పద్మ టవర్స్‌ వద్దకు రాగానే అదుపుతప్పింది. తొలుత మున్సిపల్‌ చెత్త బండిని ఢీకొట్టింది.

దాని డ్రైవర్‌ వసంతరావుకు గాయాలయ్యాయి. అప్పటికీ మేఘ వాహనాన్ని నియంత్రించలేకపోవడంతో కారు సైకిల్‌ మీద వెళ్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ సురభి మరియదాసు (32)ను వెనక నుంచి ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన మరియదాసు ఒంగోలు జిల్లా సాయుధ రిజర్వ్‌ (డీఏఆర్‌)లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రోల్‌కాల్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదంలో మరణించాడు. అతడికి భార్య భారతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయినా ఆగని కారు 
అయితే, ఈ ప్రమాదం తరువాత కూడా కారు ఆగలేదు. మోటారు బైకుపై చర్చికి వెళ్తున్న కొప్పేలు రామ్మోహన్‌రావును కూడా ఢీకొట్టింది.  కానిస్టేబుల్‌ దాసు భార్య సురభి భారతి ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు మేఘపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు. కారులో మరో ఇద్దరు లేడీ డాక్టర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఇదే తరహాలో వేగంగా వస్తున్న కారు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)