Breaking News

నెల్లూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురు మృతి

Published on Sat, 02/10/2024 - 07:07

కావలి: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావలిలోకి టోల్‌ప్లాజా వద్ద రెండు లారీ, ఓ ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

వివరాల ప్రకారం.. కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటక రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 14 మందికి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. 

అదేసమయంలో ఎదురుగా ప్రైవేట్‌ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందినే వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక, ప్రైవేట్‌ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక, బస్సు కావేరీ ట్రావెల్స్‌కు సంబంధించినదిగా గుర్తించారు. 

Update..
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా ఏడుకు చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. రెండు లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. 

నెల్లూరు ప్రమాదంపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి

నెల్లూరు బస్సు ప్రమాదంపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ప్రమాద పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని,  ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్ది కామెంట్స్

ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. గాయపడిన వారిని నెల్లూరు, ఒంగోలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాం. బాధితుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. 9440796383 ద్వారా సమాచారం ఇస్తున్నాం. ప్రమాదానికి కారణం ఏమిటన్నది విచారణలో తెలుస్తుంది.

గాయపడిన వారి వివరాలు..
చంద్ర శేఖర్(37)..
సురేష్..(32)
గోపి నాథ్ (23)
మనోజ్ (23)
రాజ్ కుమార్ (38)
ఎస్.రమణ (38)
పవన్ (23)
ధనవేశ్వర్ (28)
రణధీర్ (31)
త్రికరణ్ (46)
శ్వేతా (19)
అజిత (30)
కన్నన్ (50)
రూప( 30)
మైథిలి (35)
అక్షయ్ (34)
గణేష్(51)
నితీష్ (20)..
లోకేష్ (35)
లక్ష్మీ (34)
కమలమ్మ (63)
నిర్మల(49)
కేశవ్(39).

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)