Breaking News

గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద

Published on Wed, 07/26/2023 - 04:51

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 7,59,015 క్యూసెక్కులకు పెరిగింది. దాంతో నీటి మట్టం 38.9 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం నుంచి 7,62,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌లోకి 6,86,660 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి మట్టం  9.40 అడుగులకు చేరింది.

గోదావరి డెల్టాకు 9,900 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 6,76,760 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన వరద పెరిగిన నేపథ్యంలో బుధవారం ధవళేశ్వరం బ్యారేజ్‌కి చేరే ప్రవాహం పెరగనుంది. గోదావరిలో ఎగువన తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌లోకి 5,79,730 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్‌లోకి 7.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం వల్ల బుధవారం, గురువారం బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)