పోలవరం డయాఫ్రమ్‌వాల్‌పై 28లోగా నివేదిక

Published on Sun, 02/26/2023 - 04:30

సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్‌ పాపాల వల్ల.. గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న పోలవరం ప్రధాన డ్యామ్‌ డయాఫ్రమ్‌వాల్‌ (పునాది) భవితవ్యాన్ని తేల్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. డయాఫ్రమ్‌వాల్‌ సామర్థ్యాన్ని తేల్చేందుకు గతనెల 26 నుంచి ఈనెల 10వ తేదీ వరకూ ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌) నిపుణుల బృందం హైరిజల్యూషన్‌ జియోఫిజికల్‌ రెసిస్టివిటీ ఇమేజింగ్, సీస్మిక్‌ టోమోగ్రఫీ విధానాలలో పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల ఫలితాలను విశ్లేషించి.. ఈనెల 28లోగా రాష్ట్ర జలవనరుల శాఖ, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)లకు ఆ బృందం నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) రిటైర్డ్‌ చైర్మన్‌ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌(డీడీఆర్పీ) బృందం పోలవరం ప్రధాన డ్యామ్‌ డయాఫ్రమ్‌వాల్‌ను మార్చి 4న క్షేత్ర స్థాయిలో పరిశీలించనుంది.

డయాఫ్రమ్‌వాల్‌ సామర్థ్యం బాగున్నట్లు ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఇస్తే.. ప్రధాన డ్యామ్‌ పనులకు డీడీఆర్పీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. ఒకవేళ డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ తేల్చితే.. దాన్ని సరిదిద్దాలా? లేదంటే పాతదానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించాలా? అనే అంశాలపై సీడబ్ల్యూసీ, ఐఐటీ(ఢిల్లీ, తిరుపతి, హైదరాబాద్‌) ప్రొఫెసర్లతో మార్చి 5న డీడీఆర్పీ బృందం మేధోమథనం జరుపుతుంది. ఇందులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా డయాఫ్రమ్‌వాల్‌ భవితవ్యాన్ని తేల్చుతుంది.  

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)