Breaking News

డిజిటల్‌ కార్పొరేషన్‌పై పదేపదే అబద్ధాలా?

Published on Sat, 10/14/2023 - 03:40

సాక్షి, అమరావతి : ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌పై బురద జల్లడమే లక్ష్యంగా కొన్ని ఎల్లో మీడియా పూర్తి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఆ సంస్థ మండిపడింది. సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఖర్చుచేసింది రూ.88.56 కోట్లు అయితే..  రూ.500 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పడం దారుణమని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం అబద్ధాలు చెబుతున్నారని.. కానీ, అంకెలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయని తెలిపింది.

2020–21, 2021–22 సంవత్సరాలకు సంబంధించి సంస్థ వివరాలను కాగ్‌కు సమర్పించామని, 2022–23 సంవత్సరం నివేదికలు త్వరలో సమర్పిస్తామని పేర్కొంది. సిబ్బంది నియామకంలో ఎలాంటి రాజకీయ జోక్యంలేదని, కేవలం చేయాల్సిన పనికోసం అవసరమైన వ్యక్తులను వారి అర్హతలను బట్టి వివిధ మీడియా సంస్థలకు చెందిన వారిని నియమించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుత డిజిటల్‌ మీడియా అవసరాలకు అనుగుణంగా అందులో నైపుణ్యం, సాంకేతిక అనుభవం ఉన్న వ్యక్తిని వీసీ అండ్‌ ఎండీగా ప్రభుత్వం నియమించిందని పేర్కొంది.

సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వీసీ అండ్‌ ఎండీ జీతం తీసుకోలేదని, కేవలం రాష్ట్రం కోసం పనిచేయాలనే తపనతో పనిచేశారని తెలిపింది. డిజిటల్‌ కార్పొరేషన్‌కు ఐ–డ్రీమ్‌ మీడియాతో సంబంధంలేదని, కార్పొరేషన్‌ ఆ సంస్థకు ఎటువంటి ప్రకటనలు ఇవ్వలేదని సంస్థ స్పష్టంచేసింది. మీడియా సంస్థలు, వెబ్‌సైట్లకు ప్రకటనలను వాటి కార్యక్రమాలు, వాటికి ప్రజల్లో ఉన్న ఆదరణ, వాటి రీచ్‌ను బట్టి విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని పాటిస్తోందని తెలిపింది. పదేపదే అబద్ధాలు రాయడం ద్వారా ప్రజలు వాటిని నిజం అనుకునేలా నమ్మించడానికి ప్రయత్నించడం సరికాదని పేర్కొంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా చేయడం కోసమే తమ సంస్థ పనిచేస్తోందని ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ స్పష్టంచేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే సంస్థ లక్ష్యమని పేర్కొంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)