Breaking News

రిమాండ్‌ ఆర్డర్‌ నిందితునికి ఇవ్వాలి

Published on Thu, 11/21/2024 - 05:37

సాక్షి, అమరావతి: ఏదైనా కేసులో తనకు రిమాండ్‌ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అందుకు గల కారణాలతో కూడిన రిమాండ్‌ ఆర్డర్‌ను తనకు అందజేయాలని నిందితుడు కోరితే, ఆ ఆర్డర్‌ను నిందితునికి సత్వరమే అందజేయాల్సి ఉంటుందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. పౌరుల హక్కులు ముడిపడి ఉన్న కేసుల్లో కింది కోర్టులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. 

సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ పప్పుల వెంకటరామిరెడ్డి అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రిమాండ్‌ ఆర్డర్‌ కోసం వెంకటరామిరెడ్డి సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో తెలుసుకోవాలని ఆయన తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. 

రిమాండ్‌ ఆర్డర్‌ నిందితునికి ఇవ్వకపోతే అది చెల్లదు..
తన కుమారుడు పప్పుల వెంకటరామిరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు అతనికి విధించిన రిమాండ్‌ చెల్లదంటూ పప్పుల చెలమారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెలమారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌. శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రిమాండ్‌కు గల కారణాలను నిందితుడైన వెంకటరామిరెడ్డికి అందచేయ­లేదన్నారు. 

రిమాండ్‌ ఆర్డర్‌ను నిందితునికి అందచేయడం తప్పనిసరని, అలా ఇవ్వని పక్షంలో ఆ రిమాండ్‌ చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి పలు తీర్పులున్నాయన్నారు. అంతకుముందు.. పోలీసుల తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ, వెంకటరామిరెడ్డిని అరెస్టుచేసి కోర్టు ముందు హాజరుపరిచామన్నారు. అందువల్ల ఈ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. నిందితుడు కింది కోర్టులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఎలాంటి విచారణ అవసరంలేదన్నారు. 

అరెస్టుకు గల కారణాలను కూడా అతనికి తెలియజేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కింది కోర్టులు నిందితులకు వారి రిమాండ్‌ ఆర్డర్‌ను సత్వరమే అందజేయాలని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడు రిమాండ్‌ ఆర్డర్‌ కోసం దరఖాస్తు చేయలేదని తెలిపింది. ఈ సమయంలో శ్రీరామ్‌ స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాము మరోసారి పరిశీలన చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)