Breaking News

హైకోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఊరట

Published on Fri, 06/20/2025 - 07:40

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. కాకాణికి రిమాండ్‌ విధిస్తూ మేజి్రస్టేట్‌ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టింది. పిటిషనర్‌పై నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయా? లేదా? అనే ప్రాథమిక, ముఖ్యమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా రిమాండ్‌ ఉత్తర్వులు ఇచ్చారని హైకోర్టు ఆక్షేపించింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్‌ చేశారంటూ అక్రమ కేసు... 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారంటూ అల్లీపురంకి చెందిన టీడీపీ నేత మేకల సురేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని సీఐడీ పోలీసులు కాకాణిపై అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేయడంతో పాటు గుంటూరు 6వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు తన మీద జారీ చేసిన పీటీ వారెంట్‌ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ కాకాణి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్‌ లక్ష్మణరావు విచారణ జరిపారు.  

మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా వ్యవహరించారు.. 
కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. మేజి్రస్టేట్‌ యాంత్రికంగా పీటీ వారెంట్‌ జారీ చేశారన్నారు. పీటీ వారెంట్‌ కూడా సరైన ఫార్మాట్‌లో లేదన్నారు. కాకాణికి రిమాండ్‌ విధించే సమయంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలను పాటించలేదన్నారు. కాకాణిపై పెట్టిన సెక్షన్లన్నీ కూడా ఏడేళ్లలోపు శిక్ష పడేవేనని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని మేజి్రస్టేట్‌ కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మనోహర్‌రెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరావు.. పిటిషనర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)