Breaking News

వరద సాయం విడుదల

Published on Thu, 09/26/2024 - 05:16

సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరదలు, భారీ వర్షాల బాధితులకు పరిహారాన్ని సీఎం చంద్రబాబునాయుడు బుధవారం విడుదల చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బ్యాంకింగ్, బీమా, అర్బన్‌ క్లాప్‌ యాప్, ఎల్రక్టానిక్‌ ఉపకరణాల మరమ్మతులపై తొలుత సమీక్షించారు. వరద నష్ట పరిహారం లేఖలను లబ్దిదారులకు లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం రూ.7,600 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. 

తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రూ.602 కోట్ల మేర  పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే ఈ నెల 30 కల్లా పరిష్కరించి సాయం అందిస్తామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి, ఆ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించి, బాధితులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రం మొత్తం మీద 74 మంది మరణించారని చెప్పారు. వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. 

విజయవాడలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నీళ్లు వచ్చిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉన్నవారికి రూ.10 వేల చొప్పున అందించినట్లు తెలిపారు. రుణాలు రీషెడ్యూల్‌ చేయమని చెప్పామన్నారు. డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్‌సీలు, ఆధార్‌ కార్డులు, జనన, మరణ ధ్రువీకరణపత్రాలు ఇలా ఏ సర్టిఫికెట్‌ పోయినా వెంటనే ఉచితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చి­నట్లు చెప్పారు. పాడైపోయిన పాఠ్యపుస్తకాల స్థానంలో పిల్లలందరికీ కొత్త పుస్తకాలు ఉచితంగా ఇవ్వమని చెప్పామన్నారు. 

ఆర్థిక సాయానికి సంబంధించి గత రెండు రోజుల్లో 17 వేల అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వాటిలో 4 వేలు డూప్లికేషన్స్‌ పోగా 13 వేల దరఖాస్తులను రెండు రోజుల్లో పరిశీలించి, అర్హులైన వారికి సాయమందిస్తామని చెప్పారు. సహాయ కార్యక్రమాలను ఈ నెల 30కి పూర్తిచేసి ఆరోజు సాయంత్రం థ్యాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.400 కోట్ల విరాళాలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ఈ రోజు విడుదల చేసిన రూ.602 కోట్లలో రూ.400 కోట్లు దాతలిచ్చినవేనని తెలిపారు. విధ్వంసాలు చేయడం, వాటిని వేరేవారిపై నెట్టడం కొందరికి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు, శాంతిభద్రతలు కాపాడటం వంటివి తమ బాధ్యత అని, వీటికి ఎవరు విఘాతం కలిగించినా, తప్పులు చేసినా సహించబోమని చెప్పారు.  

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)